జాతీయ వార్తలు

భారతంలో అర్జునుడులాంటోడ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఆగస్టు 6: తాను మహాభారతంలో అర్జునుడు లాంటి వాడినని, లక్ష్యంపై గురి తప్ప మరేమీ పట్టించుకోనని అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) సమన్వయకర్త ప్రతీక్ హజేలా అన్నారు. పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తన కర్తవ్యాన్ని నిర్వహించానని, ఇందులో ఎలాంటి రాజకీయ వత్తిళ్లు తనపై ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. ‘అసాం జాతీయ పౌర రిజిస్టర్ తయారీలో చట్టానికి అనుగుణంగా వ్యవహరించాను. మహాభారతంలో అర్జునుడి లాంటి వాడిని. బంగారు చేపను పడగొట్టడం ఒక్కటే అతని లక్ష్యం. అదేమాదిరిగా నేను నా కర్తవ్య నిర్వహణపై దృష్టి సారించాను. నాపై ఎలాంటి రాజకీయ వత్తిళ్లు పనిచేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎప్పుడైతే నాకు కీలక బాధ్యతలు అప్పజెప్పారో అందుకు అనుగుణంగా రాజ్యాంగపరమైన న్యాయసూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాను. ఈ విషయంలో నాపై ఇంటా బయట ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.