జాతీయ వార్తలు

మరో ఐదు నదుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో మరో ఐదు నదుల అనుసంధాన బృహత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్గరీ సోమవారం నాడిక్కడ వెల్లడించారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి ఆర్థిక సాయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే మార్చి నెలలోగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించాలన్న లక్ష్యంతో కృషి జరుగుతోందని రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగాప్రకటించాలంటూ క్యాబినెట్‌ను కోరామన్నారు. భూటాన్ దేశంతో ముడిపడివుండటం వల్ల మానస- సంకోష్- తీష్టా- గంగానదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభంలో అలస్యం అవుతోందని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అలాగే కోసీ-మేచీ, కోసీ-ఘగరా నదుల అను సంధాన ప్రాజెక్టు పథకం నేపాల్‌తో ముడిపడివుందన్నారు. చునార్-సోనే బ్యారేజి, సోనే డ్యామ్- గంగానది దక్షిణ ప్రాంతాల అనుసంధాన ప్రాజెక్టు సైతం భూటాన్ దేశంతో లింక్ అయివున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టులకు నీటి నిల్వలకు సంబంధించిన వ్యవహారం సానుకూలపడిన తర్వాతే నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
హిమాలయాల్లోంచి ఉద్భవించే నదీ జలవనరుల వినియోగం, అభివృద్ధిని దృష్టిలో వుంచుకుని బీహార్ రాష్ట్రంలోని ఆరు నదుల అనుసంధాన ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో మానస- సంకోష్- తీష్టా- గంగా ప్రాజెక్టు, కోసీ- ఘగరా ప్రాజెక్టు, చునార్-సోనే బ్యారేజి ప్రాజెక్టు, సోనే డ్యామ్- గంగానది దక్షిణ భాగం ప్రాజెక్టు, జోగిగోపా- తీష్టా- ఫరక్కా ప్రాజెక్టు ఉన్నాయని మంత్రి వివరించారు. కాగా దేశంలో మొత్తం 30 నదీ అను సంధాన ప్రాజెక్టులను చేపట్టేందుకు నిర్ణయించగా అందులో ఐదు ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఇందులో కెన్-బట్వా, గోదావరి- కావేరి, డామన్ గంగా-పింగళ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు సాగుతున్నాయన్నారు. ఈ దిశగా ఏకాభిప్రాయ సాధన కూడా జరిగిందని, కొన్ని ఒప్పందాలు జరగాల్సివుందని వివరించారు. కొత్తగా చేపట్టనున్న ఐదు బృహత్ ప్రాజెక్టుల విషయమై మంత్రి గడ్గరీ వివరిస్తూ ఇందులో రెండు ప్రాజెక్టులు గుజరాత్, మహారాష్టల్ల్రో చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా బుందేల్‌ఖండ్‌లోని కెన్-బట్వా ప్రాజెక్టుకు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సంబంధం ఉందని ఇందుకు సంబంధించిన ఒప్పందం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే జరుగుతుందని గడ్గరీ సభకు వివరించారు.
రూ.60 వేల కోట్లు ఖర్చుతో
పోలవరం ప్రాజెక్టు
గోదావరి జలాల ఆధారంగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టును 60వేల కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణం జరుగుతోందని గడ్కరీ వెల్లడించారు. అలాగే గోదావరి బ్యాక్ వాటర్‌ను కృష్ణానదికి, కృష్ణానది బ్యాక్ వాటర్‌ను పెన్నార్‌కు, పెన్నార్ నీటిని కావేరీ నదికి మళ్లించేందుకు కృషి జరుగుతోందన్నారు. మొత్తం మూడు వేల టీఎంసీల నదుల నీరు సముద్రం పాలవుతోందని ఇందులో 40 టీఎంసీల కోసం కర్నాటక తమిళనాడుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందని మంత్రి గడ్గరీ వివరించారు. దేశవ్యాప్తంగా వరదల కారణంగా ఐదువేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు మంత్రి సభకు వివరించారు. ఇందులో బీహార్ అధికంగా నష్టపోయిందన్నారు.