జాతీయ వార్తలు

నిరసన మా హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని తెలుగుదేశం ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా సోమవారం తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గల్లా జయ్‌దేవ్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో నిరసన తెలపడం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కని అన్నారు. ఆంధ్రులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలనే పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నామని, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటివాళ్లకు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు పార్లమెంట్ సాక్షిగా నిరసనను వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
పార్లమెంట్‌కు రాముడొచ్చాడు!
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై వివిధ వేషధారణలతో నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సోమవారం రామావతారంలో పార్లమెంట్‌కు వచ్చారు. రాముని వారసులమని చెప్పుకోనే బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. రాముని పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ తరువాత కాలంలో రాముడినే పక్కన పెట్టిందని, అందుకే రాముని వేషంలో నిరసన తెలుపుతున్నానని శివప్రసాద్ చెప్పారు.

చిత్రం..పార్లమెంటు ఆవరణలో సోమవారం గాంధీ విగ్రహం ఎదుట శ్రీరాముని వేషంలో ఎంపీ శివప్రసాద్