జాతీయ వార్తలు

సైద్ధాంతిక రాహిత్యం.. మేధోశూన్యత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాహిత్యం పెరిగిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మేధోశూన్యత ఆవహించిందని సోమవారం ఇక్కడ అన్నారు. ‘యువతకు సోషలిజయంకు కమ్యూనలిజానికి తేడా తెలియదు.. అలాగే సోషలిజంకు ప్రజాస్వామ్యానికి మధ్య తేడా తెలియకుండా పోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూసినా రాజకీయాల్లో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, మేధోసంపత్తి అన్నది చరమాంకానికి చేరిందని సీనియర్ రాజకీయవేత్త పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి రచించిన ‘టెన్ ఐడియాలజీస్’ మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయనో వార్తాసంస్థతో మాట్లాడుతూ యువత పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. మతతత్వానికి, సామ్యవాదానికి తేడా ఏమిటో వారికి (యువత)కు తెలియకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ‘మంచి సిద్ధాంతమా? చెడ్డ సిద్ధాంతమా అన్నదానిపై నాకు బాధలేదు. ఏ సిద్ధాంతం లేకపోవడం, మేధో సంపత్తి మృగ్యమైపోవడమే నన్ను కలచివేస్తోంది’ అని జైపాల్‌రెడ్డి అన్నారు. ‘సోషలిజం గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. అసమానతలపై ఎవరైనా మాట్లాడవచ్చు. ప్రాధమిక అవసరాలు, స్వేచ్ఛపై ఎవరైనా మాట్లాడవచ్చు’ అని 76ఏళ్ల రెడ్డి వ్యాఖ్యానించారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సిద్ధాంతాల ప్రాతిపదికగానే జరుగుతాయని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని బదులిచ్చారు. సైద్ధాంతిక పోరుతోపాటు ఆర్థిక, సామాజిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని సీనియర్ కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. అలాగే తీవ్ర మతతత్వ జాతీయవాదం, ఆధునిక జాతీయవాదం మధ్య పోటీ ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయవాదం అన్న పదానికే అర్థం మారిపోయిందని, దానికి వక్రభాష్యం పలుకుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ సిద్ధాంతం పైచేయిగా ఉంటోందన్న ప్రశ్నకు ‘దేశంలో ఎన్నో ఏళ్లుగా వివిధ సిద్ధాంతాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఎప్పుడూ పరిమితులు దాటలేదు’ అని జైపాల్ తెలిపారు. దేశంలో సిద్ధాంతాలు రెండుగా చీలిపోయాయని ఒకటి ఆధునిక మితవాదం, రెండోది అతివాదంగా ఆయన వివరించారు. మంగళవారం ఆవిష్కరిస్తున్న జైపాల్‌రెడ్డి టెన్ ఐడియాలజి పుస్తకంలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ చరిత్రతోపాటు పారిశ్రామిక విప్లవం, హ్యూమనిజం, ప్రొటస్టెంట్ రిఫామ్స్, సైంటిఫిక్ రివల్యూషన్‌ను ప్రస్తావించారు.