జాతీయ వార్తలు

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు నాల్కో ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వరంగ సంస్థ నాల్కో ప్రతిపాదనలు సమర్పించినట్లు గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్ధీబాయ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కోసం కొన్ని బ్లాక్‌లను కేటాయించవలసిందిగా నాల్కో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలను సమర్పించిందని చెప్పారు. బాక్సైట్ గనుల కేటాయింపు జరిగితే విశాఖపట్నంలో అల్యూమినా రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని నాల్కో తన ప్రతిపాదనలలో పేర్కొన్నట్టు ఆయన వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలోని గూడెం, జెర్రలలోని బాక్సైట్ బ్లాక్‌లతోపాటు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కాటంరాజు కొండ వద్ద గల బాక్సైట్ బ్లాక్‌లను తవ్వకాల కోసం లీజుకు కేటాయించాల్సిందిగా 2007 నవంబర్‌లోనే నాల్కో దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ఆయా బాక్సైట్ బ్లాక్‌లలో తవ్వకాలు జరిపేందుకు 2009 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నాల్కోకు అనుమతించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు.