జాతీయ వార్తలు

గోరక్షణ పేరుతో మారణకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: గోరక్షకుల పేరిట దేశంలో జరుగుతున్న హత్యాకాండపై పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. మూక హత్యల నిరోధకానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. అమాయకులపై జరుగుతున్న దాడులను అరికట్టి, దోషులను కఠినంగా శిక్షించేందుకు చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ దురాఘతాలన్నీ కమలనాథుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వమే మూక హత్యలు, దాడులకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.‘ విద్యుత్, నీళ్లు, వైద్య సదుపాయాల కోసం మేం మాట్లాడుతుంటే..ఎన్‌డీఏ ప్రభుత్వం గోవులు,మేకలు, ఆవుపేడ గురించి మాట్లాడుతోంది’అని ఆయన విరుచుకుపడ్డారు. లవ్ జిహాద్, యాంటీ రోమియో దళాలంటూ పౌరులపై దాడులకు తెగబడుతున్నట్టు సింగ్ తీవ్ర విమర్శ చేశారు. నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో దేశం అథోగతి పాలైందని ఎంపీ మనోజ్ ఝా ధ్వజమెత్తారు. నాలుగేళ్ల క్రితం మూక హత్యలు మాట ఎప్పుడూ వినలేదని మోదీ అధికారంలోకి వచ్చాక రోజూ ఏదోమూల జరుగుతునే ఉన్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నాయని నాగరిక్ అధికార్ మంచ్ కన్వీనర్ సేభా ఫరూఖీ అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేదని ఆమె ఆరోపించారు.