జాతీయ వార్తలు

ఎన్జీవోల దుర్వినియోగం అడ్డుకట్టకు రాష్ట్రాలు నడుంబిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశంలో ముజఫర్, డియోరియా సంఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఎన్జీవోల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి, ఆశ్రమాల్లో ఉన్న బాలికల రక్షణకు సంబంధించి రాష్ట్రాలు ఒక ఏకీకృత విధానాన్ని అవలంబించాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పలు ఆశ్రమాలలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి రక్షణకు ఒక విధానాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇలాంటి చర్యలకు కొంత అడ్డుకట్ట వేయవచ్చునని ఆమె అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ ఆశ్రమాలు కేవలం నీడలేని వారికి ఆశ్రయం మాత్రమే కల్పిస్తున్నాయని, అలాకాకుండా మహిళలు, బాలికలు, పిల్లలందరికీ ఒకచోట ఆశ్రయం కల్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసే పథకాలను ఆయా రాష్ట్రాలు చేపట్టాలని ఆమె సూచించారు. రాష్ట్రాలు వీరికి ఒక శాశ్వత ఆశ్రయం కల్పించడానికి చర్యలు చేపడితే భవనాలు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు కావాల్సిన నిధులను ఇవ్వడానికి తమ శాఖ సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు.
ముజఫర్‌లో ఎన్జీవో ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమంలో బాలికపై లైంగిక వేధింపులు చోటుచేసుకున్నాయన్న విషయం టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, ముంబయి వారు సమర్పించిన ఆడిట్ రిపోర్టు ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటిసారి వెలుగుచూసిందని చెప్పారు. దీంతో తాము మే 31న దాని యజమాని బ్రిజేషన్ ఠాకూర్ సహా 11 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. జూలై 26న దీనిపై సీబీఐ విచారణ జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆశ్రమంలోని 34 మందిపై లైంగిక అత్యాచారం జరిగిందని వైద్య నివేదికలు నిర్ధారించాయని మంత్రి తెలిపారు. అలాగే యూపీలోని డియోరియాలోని ఒక ఆశ్రమంలో ఇలాంటి సంఘటనే నిన్న వెలుగుచూసిందని అన్నారు.