జాతీయ వార్తలు

గడ్కరీగారూ.. మంచి ప్రశ్న వేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ‘గడ్కరీగారూ.. మంచి ప్రశ్న వేశారు.. దేశ ప్రజలంతా అదే ప్రశ్న వేస్తున్నారు’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై వ్యంగ్య బాణాలు సంధించారు. మహారాష్టల్రో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంపై గడ్కరీ శనివారం మాట్లాడుతూ ‘దేశంలో ఉద్యోగాల్లేవు.. రిజర్వేషన్ల పెంచినందువల్ల ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై స్పందించిన రాహుల్ తన విమర్శలకు పదునుపెట్టారు. ‘దేశంలో ఉద్యోగాల్లేవు.. ఐటీ అభివృద్ధి చెందడంవల్ల బ్యాంకుల్లో ఉద్యోగాలు తగ్గిపోయాయి.. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు లేవు... ఇక ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి’ అంటూ గడ్కరీ చేసిన వాఖ్యలను రాహుల్ ఎద్దేవా చేశారు. శనివారం గడ్కరీ మాట్లాడుతూ- ప్రతివాళ్లూ రిజర్వేషన్లు అడుగుతున్నారు.. బిహార్, ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులదే అగ్రస్థానం. అయినా వాళ్లుకూడా వెనుకబడ్డామని అంటారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పేదలు చాలామంది ఉన్నారు.. వారికి కులం, భాష, మతంతో సంబంధం లేదు. వారికి కావాల్సిన కూడు, గుడ్డ, నీడ అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. రిజర్వేషన్ల ఉద్యమాలను రాజకీయ పార్టీలు ఎగదోయడం భావ్యం కాదని, మరాఠా ఉద్యమాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చూసుకుంటారని అన్నారు.