జాతీయ వార్తలు

బీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్‌సీబీసీ)కి రాజ్యాంగబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు తెలిపింది. సోమవారం రాజ్యసభలో జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన తరగతుల జనాభా లెక్కల సేకరణకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు ఎగువసభలో ఈనెల 2న ప్రవేశపెట్టిన 2017 రాజ్యాంగ బిల్లు (123వ సవరణ)కు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభలో ఇదే అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న 2/3వ వంతు మెజారిటీ సభ్యులు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత తప్పనిసరిగా కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ అందుకు ఉద్దేశించి ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపారు. గత ఏడాది జూలై 31న ఈ బిల్లు రాజ్యసభలో ప్రతిపాదనకు రాగా తగిన చట్టసవరణ చేస్తూ దిగువసభకు పంపించింది. దీంతో గతవారం కొన్ని మార్పులు చేసి చట్టంగా తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ ఈ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారికోసం ఉద్దేశించిన జాతీయ కమిషన్ బిల్లు వల్ల తమపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా త్వరితగతిన న్యాయం కోసం పోరాడేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కొత్త బిల్లు ఓబీసీ వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయసభల్లోని అన్ని విపక్షాల నుంచి సలహాలు స్వీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్‌సీబీసీ)లో మహిళల ప్రాతినిధ్యం ఉంటుందని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లు కారణంగా ఆయా రాష్ట్రాల హక్కులను హరించడం కాదని ఆయన స్పష్టం చేశారు.