జాతీయ వార్తలు

రాజ్యాంగంలో హింసకు తావులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, కసరగడ్: మన రాజ్యాంగంలో హింసకు తావు లేదని భారత రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కేరళలో సీపీఐ-ఎం యువ కార్యకర్తను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పొడిచి చంపిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ హింసను అడ్డుకోవడానికి పౌర సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని అన్నారు. తిరువనంతపురంలో జరిగిన కేరళ అసెంబ్లీ వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘ఫెస్టివల్ ఆఫ్ డెమాక్రసీ (ప్రజాస్వామ్య పండుగ)’ అనే అంశంపై మాట్లాడుతూ ఇకముందు రాష్ట్రంలో రాజకీయ హింసాత్మక సంఘటనలకు జరగకూడదని ఆశిస్తున్నట్టు చెప్పారు.
చర్చ, సమ్మతి, అసమ్మతి, అంగీకారం, అనంగీకారం వంటి అంశాలు రాజకీయాల్లో ఉండాలే తప్ప హింసకు మన రాజ్యాంగంలో చోటులేదని ఆయన అన్నారు. గత రాత్రి జరిగిన సీపీఐ (ఎం) కార్యకర్త హత్యను ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటి సంఘటనలను సమాజ ప్రతిష్టను దిగజారుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య పండుగ కార్యక్రమంలో రాజకీయ హింసపై కూడా చర్చించాలని అన్నారు. ఒక్క కేరళ ప్రజలే కాక దేశంలోని వారందరూ ఇలాంటి సంఘటనలపై తీవ్రంగా ఆలోచించాలని అన్నారు. రాజకీయాలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్య గొప్పదనం అంశాలు, మన సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. ఏ సమస్యపైనైనా చర్చలు, వాదోపవాదాలు మన సమాజానికి చాలా అవసరమని, ఇదే మార్గాన్ని ఆదిశంకరాచార్య, శ్రీ ఆదినారాయణగురు లాంటి మహానుభావులు మనకు చూపారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మన దేశంలో హిందూయిజం, జుడాయిజం, ఇస్లామ్ తదితరమైనవి ఎవరి నమ్మకానికి తగ్గట్టు వారు పాటిస్తుంటారని, ఒకరు ఒక దానిని నమ్మితే రెండో దానిపై ఇష్టం ఉండకపోవచ్చునని, అయితే ఇది అంత ముఖ్యం కాదని, మన సంస్కృతి, సంప్రదాయాల ద్వారా ఎంతమందిని ప్రభావితం చేస్తున్నామన్నది ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని అన్నారు. పలు అంశాల్లో కేరళ అందరికీ ఆదర్శంగా నిలిచి ఉండటాన్ని రాష్టప్రతి ఈ సందర్భంగా ప్రశంసించారు. కేరళ ముఖ్యమంత్రి పనరాయి విజయన్ మాట్లాడుతూ లౌకిక పునాదులపై భారత ప్రజాస్వామ్యం వర్థిల్లుతోందని అన్నారు. లౌకిక వాదం, స్వేచ్ఛావాదం లేకుండా ప్రజాస్వామ్యం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పి.శతశివం, విపక్ష నేత రమేష్ చెన్నితల , స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తిరువనంతపురంలో సోమవారం మొక్కనాటి నీరు పోస్తున్న రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్