జాతీయ వార్తలు

అడ్రస్‌లేని అచ్చేదిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆర్థిక రంగంలో ఘోరంగా విఫలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో అవినీతి, సామాజిక విభజన విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత మంగళవారం మొదటి సారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించారు. అచ్చేదిన్ పిలుపునిచ్చిన ప్రధాని మోదీ అమలులో ఘోర వైఫల్యం చెందారని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడంలో మోదీ ప్రభుత్వం చతికిలపడిందన్నారు. పెద్ద నోట్ల రద్దు తదితర చర్యల ద్వారా ఆర్థిక రంగాన్ని దెబ్బ తీశారన్న రాహుల్ ‘ దేశంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు’అని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ సంస్థలను ఓ పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ తమ వర్గం వారిని రాజ్యాంగ సంస్థల్లోకి చొప్పించటం ద్వారా కలుషితం చేస్తున్నట్టు కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు.‘ప్రస్తుత పాలకుల
పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మనమంతా కష్టపడి పని చేయటం ద్వారా ప్రత్యామ్నాయ వ్యవస్థను నెలకొల్పవచ్చు’అని ఆయన ఉద్ఘాటించారు. ఏడాదికి 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. రైతుల ఆదాయ రెండింతలు ఎక్కడైందని మోదీని ప్రశ్నించారు. వ్యాపార, వాణిజ్య రంగం తిరోగమనంలో సాగుతోందని ఆయన ఆరోపించారు. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం పెరిగిపోతోందని ఆయన అన్నారు. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు వేయిస్తామన్న ప్రధాని మోదీ హామీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు.‘పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించగలరా? మహిళలకు భద్రత కల్పించగలరా? దళితులకు న్యాయం కల్పించగలరా?’ అని రాహుల్ గాంధీ నిలదీశారు. అసమర్థ మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారని ఆయన దుమ్మెత్తిపోశారు. జీఎస్‌టీని అమలు చేయటం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య రంగాలను దెబ్బ తీసిందని కాంగ్రెస్ చీఫ్ నిప్పులు చెరిగారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి, నల్ల ధనాన్ని అదుపు చేయలేకపోయిందని, సరికదా దొంగ నోట్లు చలామణి విచ్చలవిడిగా పెరిగిపోయిందని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతికి రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం ఓ ఉదాహరణగా రాహుల్ చెప్పారు. మోదీ హయాంలో మహిళలు, చిన్న పిల్లలకు భద్రత లేకుండాపోయిందని ఆయన చెప్పారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఏమయ్యయని రాహుల్ ప్రశ్నించారు. అసోం జాతీయ పౌరుల రిజిష్టరు తయారీ మోదీ ప్రభుత్వం అసమర్థతకు నిదర్శమని ఆయన ఎద్దేవా చేశారు. ‘దేశ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు మనం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది’అని ఎంపీలకు హితవుచెప్పారు. నియంతృత్వానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో విజయం సాధించేందుకు అందరం కృషి చేయాలని రాహుల్ గాంధీ పిలుపుఇచ్చారు.