జాతీయ వార్తలు

భారీగా నకిలీ కరెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, ఆగస్టు 7: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న దొంగనోట్లను నిలువరించేందుకు ప్రభుత్వం నోట్ల రద్దును చేపట్టిన అనంతరం గుజరాత్ రాష్ట్రంలో అధిక మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడింది. దేశ వ్యాప్తంగా సరిహద్దు రాష్ట్రాల్లో 13.8కోట్ల నకిలీ కరెన్సీ పట్టుబడగా అందులో కేవలం గుజరాత్ రాష్ట్రంలో 5.94 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు హోం శాఖ వ్యవహారాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ ఆహిర్ మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అందించిన వివరాల మేరకు 2016 నవంబర్ 9 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు మన దేశంలోని నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులోని రాష్ట్రాల్లో 13.87 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పట్టుబడిందని, అందులో గుజరాత్‌లో మాత్రమే 5.94 కోట్ల విలువైన కరెన్సీని పట్టుకున్నట్లు ఇదే దేశంలోకెల్లా అతిపెద్ద మొత్తమని మంత్రి సభకు వివరించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో 2.19 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో రెండు కోట్లు, మిజోరాంలో రూ.కోటి విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు వివరించారు. దేశంలో దొంగనోట్ల చెలామణి, స్మగ్లింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే శక్తులపై నిఘావుంచి చర్యలు తీసుకునేందుకు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ విభాగాలు కృషి చేస్తున్నాయ ని మంత్రి సభకు తెలిపారు. స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ లేదా నాణేల చెలామణి వంటి చట్ట సమ్మతం కాని వ్యవహారాలను తీవ్రవాద కార్యకలాపాలుగానే పరిగణించాల్సి వస్తుందన్నా రు. ఈ వ్యవహారాలను నివారించేందుకు ఓ ప్రత్యేక కోఆర్డినేషన్ గ్రూప్‌ను ఏర్పాటు చేశామని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఇంటలిజెన్స్, సెక్యూరిటీ వ్యవస్థలతో సమన్వయంతో పనిచేస్తుందని వివరించారు. ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాల్లో సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడంతోబాటు, అదనపు సిబ్బందిని నియమించి నిత్యం నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉగ్రవాదులకు నిదులివ్వడం, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడం వంటి చర్య లు చేపట్టేందుకు ప్రత్యేకంగా టీఎఫ్‌ఎప్‌సీ వి భాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లో ప్రత్యేక పోస్టులను, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ దిశలో భారత-బంగ్లాదేశ్‌ల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు.