జాతీయ వార్తలు

పరిపాలనాదక్షుడు.. గొప్ప ప్రజానాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘ కరుణానిధి గొప్ప ప్రజానాయకుడు, ప్రాంతీయంగా ప్రజల ఆకాంక్షల సాకారానికి పోరాడూతూ దేశ ప్రయోజనాలకు నిలబడిన జాతీ య నాయకుడు అని’ మోదీ నివాళులర్పించారు. కాగా కరుణానిధి మృతికి సంతాపసూచకంగా తమిళనాడు రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.
కాగా తాను బుధవారం చెన్నైకు వెళ్లి దివంగత మహానేత కరుణానిధికి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. తమిళ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప రాజకీయవేత్త అని మోదీ పేర్కొన్నారు. సామాజిక సంక్షేమం కోసం అలుపెరగకుండా పోరాడారన్నారు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించారన్నారు. సమసమాజ స్థాపనకు జీవితాన్ని అంకితం చేసిన ఇంత గొప్ప మహనీయుడిని చూడడం, కలిసి చర్చించడం గొప్ప భాగ్యమని మోదీ అన్నారు. తమిళనాడు ప్రజలు మెచ్చిన ఇంత గొప్ప నేత మరణ సమయంలో ప్రజలకు అండ గా ఉంటానన్నారు. ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కరుణానిధి బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ దురంధరుడు, అనేక సవాళ్లను ఎదుర్కొన్న ధీశాలి అని నివాళులు అర్పించారు. 1957 నుంచి ఇంతవరకు 13 సార్లు తమిళనాడు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాలకు, ప్రజాసేవకు వనె్న తెచ్చారని ఆయన సేవలను గుర్తుచేశారు.
భరతమాత ముద్దుబిడ్డ : రాహుల్ గాంధీ
భరతమాత ముద్దుబిడ్డ కరుణానిధి అని, ఆయన మృతి దేశ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. తుదిశ్వాస వరకు పేదల సంక్షేమం కోసం తపించిన గొప్ప నేత అన్నారు. తమిళ ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఇంత గొప్ప నేత కరుణానిధి అంత్యక్రియలకు తాను హాజరవుతున్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రుల సంతాపం
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడులో, జాతీయ స్థాయిలో కరుణానిది తన పరిపాలన ద్వారా బలమైన ముద్రవేశారన్నారు. కరుణానిధి మరణం తమిళనాడుకు తీరనిలోటు అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాట్లాడుతూ తమిళనాడు తన తండ్రిని కోల్పోయిందని, మహనీయుడని నివాళులు అర్పించారు. బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ కరుణనిధి మృతిదేశానికి తీరని లోటు అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ కరుణానిధి గొప్ప పరిపాలనాదక్షుడు, సంఘ సంస్కర్త అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్, ఎన్సీపీ జాతీయాధ్యక్షుడు శరద్ పవార్ కరుణానిధి మృతిపై సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.