జాతీయ వార్తలు

లక్నో ఈద్గాలో మహిళలకు ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 7: మూడువందల ఏళ్ల చరిత్ర కలిగిన లక్నోలోని ఐష్‌బాగ్ ఈద్గాలో మహిళలకు ప్రవేశం కల్పించారు. పురుషులతో కలిసి మహిళలు ప్రార్థనలు చేయడం ఈద్గా చరిత్రో ఇదే తొలిసారి అని సిఎన్‌ఎన్-న్యూస్ 18 వార్తా చానల్ తెలిపింది. ‘ఇస్లాం మతం పురుషులు, మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించిందని రుజువు చేయడానికి ఈ రోజు ఈద్గాలో మహిళలకు ప్రవేశం కల్పించాము, ఇలాంటి సంఘటనలు ఇక పునరావృతం అవుతాయి’ అని ఈద్గా ఈఫ్ ఇమామ్ వౌలానా ఖాలిద్ రషీద్ తెలిపారు. మహిళలు ప్రార్థనలు చేయడానికి ఈద్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముంబయిలోని హజ్ అలి దర్గాలోకి ప్రవేశం కల్పించాలని, త్రిపుల్ తలాక్‌ను తొలగించాలని ముస్లిం మహిళలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

చిత్రం.. ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం మహిళలు