జాతీయ వార్తలు

నమామి గంగకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్/న్యూఢిల్లీ, జూలై 7: పవిత్ర గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర నమామీ గంగా పేరుతో గురువారం శ్రీకారం చుట్టింది. 1500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో శుద్ది కర్మాగారాలు, ఘాట్‌లతో సహా మొత్తం 231 ప్రాజెక్టులను ఏడు రాష్ట్రాల్లో చేపడతారు. గంగా నదీ జలాలను శుద్ధి చేయడంతో పాటు దాని ప్రవాహానికీ ఎలాంటి అవరోధం లేకుండా చర్యలు చేపడతారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానాల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. హరిద్వార్‌లోనే మొత్తం 43 ప్రాజెక్టులను కేంద్ర మంత్రులు గడ్డరీ, ఉమాభారతి, మహేశ్ శర్మలు ప్రారంభించారు. గంగానది జలాలు కలుషితం కావడానికి తప్పుడు ప్రణాళికలే ప్రధాన కారణమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అన్నారు. భారత దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే గర్వకారణమైన గంగానది శుద్ధికి మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ కృత నిశ్చయంతో కృషి చేస్తుందని చెప్పారు. నమామీ గంగా పథకంలో భాగంగా చేపడుతున్న పథకాలన్నీ దశాబ్దాలుగా పేరుకు పోయిన కాలుష్యాన్ని తొలగించేందుకు తీసుకుంటుందన్న దిద్దుబాటు చర్యలేనని ఉమాభారతి అన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును విజయవంతం చేయడానికి త్వరలోనే గంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. పారిశ్రామిక వ్యర్థాలను గంగా నదిలోకి విసర్జించకుండా నిరోధించడంతో పాటు శుద్ది చేసిన ఈ జలాలను వ్యవసాయ అవసరాలకూ మళ్లిస్తామని ఉమాభారతి చెప్పారు. ఇప్పటికే గంగా చట్టానికి సంబంధించి ప్రాథమిక ముసాయిదా సిద్ధమైందని, దానిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరించిన మీదటే చట్టానికి తుది రూపునిస్తామని చెప్పారు.

చిత్రం.. గురువారం హరిద్వార్‌లో నమామీ గంగ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి