జాతీయ వార్తలు

ఇదేనా మహిళల సంరక్షణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో మహిళలు, బాలికలకు భద్రత కరవైందని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో గత మూడువేళ ఏళ్లలో జరగని ఘోరాలు చోటుచేసుకుంటున్నాయని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం ఇక్కడ మహిళా అధికార సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆశ్రమాల్లో బాలికలకు రక్షణ లేదని, మోదీ ప్రభుత్వం మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు. బీజేపీకి చెందిన ఆరెస్సెస్ విభాగంలో మహిళలకు స్థానం కల్పించారా అని ప్రశ్నించారు. అదే కాంగ్రెస్ పార్టీలో సగం విభాగాల్లో మహిళలే ఉన్నాలరన్నారు. ఆరెస్సెస్‌లో పురుషాధిక్యత భావం ఎక్కువన్నారు. మహిళల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో ఏమీ చేయలేకపోయారన్నారు. భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమాల్లో ఏముందన్నారు. ఈ స్కీంలు నినాదాలకు పరిమితమయ్యాయన్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్, ఇంకా ఉత్తరప్రదేశ్‌లో అనాథ శరణాలయాలు, హోమ్స్‌లో బాలికల జీవితాలను నాశనం చేసే విధంగా కీచకులు పుట్టుకొస్తుంటే మోదీ ప్రభుత్వం తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. యుపీలో బీజేపీ ప్రభుత్వం, బిహార్‌లో బీజేపీ మద్దతుతో జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. గత నాలుగేళ్లలో మోదీ సర్కార్ మహిళలకు చేసిందేమీ లేదన్నారు. గత మూడు వేల సంవత్సరాల చరిత్రలో కూడా జరగనన్ని ఘోరాలు మహిళల పట్ల భారత్‌లో గత నాలుగేళ్లలో చోటుచేసుకుంటున్నాయన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లును అటకెక్కించారా అని ప్రశినంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే మహిళల రిజర్వేషన్ల బిల్లును ముందుగా అమలు చేస్తామన్నారు. మహిళా సాధికారతను అటకెక్కించారన్నారు. ఎఐసీసీ విస్తరణలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కృషి చేస్తోందన్నారు. యూపీలో ఉన్నవ, బీహార్‌లో ముజఫర్‌పూర్‌లో ఘటనలు జాతికి తలవంపు తెచ్చాయన్నారు. యూపీ కేసులో బీజేపీ ఎమ్మెల్యేనే నిందితుడన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమానికి నిధులను పెంచుతామన్నారు. పార్టీలో ప్రతి విభాగంలో మహిళలకు ఇతోధిక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్రాలు, జిల్లాల బాధ్యులను ఆదేశించినట్లు చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌కు దేశాభివృద్ధిపై అజెండా లేదని, ఒక విజన్ డాక్యుమెంట్ కొరవడిందన్నారు. వీరికి ఎంతసేపు మతతత్వం అజెండా తప్పమరొకటి కాబట్టదన్నారు. సమాజంలో పురుషాధిపత్య భావనలను బీజేపీ, ఆరెస్సెస్ ప్రోత్సహిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలే బీజేపీని ఓడిస్తారని, ఆ సమయంలో ఎంతో దూరం లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవుతోందని, ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. మైనార్టీలు, మహిళలు, దళితులు, బీసీలు, గిరిజన తెగల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మహిళల సంక్షమంపై బీజేపీకి శ్రద్ధలేదని ఆయన ఎద్దేవా చేశారు. మహిళల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడంలో తాను ముందంజంలో ఉంటానన్నారు.
చిత్రం..మహిళా అధికార సమ్మేళన్‌లో ప్రసంగిస్తున్న రాహుల్