జాతీయ వార్తలు

రైల్వే మంత్రి సాక్షిగా టీడీపీ, బీజేపీ ఎంపీల గొడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య రైల్వే మంత్రిత్వశాఖ కార్యాలయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, కంభంపాటి హరిబాబుతో రాష్ట్ర మంత్రులు అయన్నపాత్రుడు, కళా వెంకట్రావు, సుజయకృష్ణ రంగారావువాగ్వివాదానికి దిగారు. సోమవారం ఉత్తరాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశం కావడానికి మంత్రిత్వశాఖ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలోబీజేపీ ఎంపీలు జీవీఎల్, కంభపాటి హరిబాబు అక్కడికి వచ్చారు. బీజేపీ ఎంపీలు తారస పడటంతో రైల్వేమంత్రితో జరిగుతున్న సమావేశానికి రావాలని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆహ్వానించారు. పీయూష్ గోయల్‌తో సమావేశానికి టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వేజోన్ ప్రకటించాలని కేంద్రమంత్రిని తెలుగుదేశం ఎంపీలు కోరారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు అంశాన్ని కూడ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీలు సుజనాచౌదరి, రామ్మోహన్‌నాయుడు మాట్లాడిన అనంతరం జీవీల్ జోక్యం చేసుకోవడంతో ఒక్కసారిగా టీడీపీ నాయకులు ఆయనపైకి విరుచుపడ్డారు. జీవీఎల్‌పైకి దూసుకుపోయే ప్రయాత్నం చేశారు. ఈ చర్యతో పీయూష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ టీడీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తెలుగుదేశం నాయకులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. మంత్రి గోయల్ మాట్లాడుతూ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని వెల్లడించారు. వెనుకబడిన జిల్లాల నిధులపై టీడీపీ నాయకులు నిలదీశారు.‘ మీరు ఏన్డీఏలో నుంచి బయటకు వెళ్లారని నిధులు వెనక్కి తీసుకోలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్లనే నిధులు వెనక్కి వచ్చాయి’అని మంత్రి చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని టీడీపీ నేతలు రైల్వేమంత్రిత్వశాఖ కార్యాలయంలో నిరసనకు దిగారు. గంటకుపైగా అక్కడే ఉండి తమ నిరసన తెలిపారు.