జాతీయ వార్తలు

మూల్యాంకనంలో తప్పు చేస్తే శిక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 7: పరీక్షలు రాయడం పిల్లలకు ఎంత ముఖ్యమో, ఆ పేపర్లను మూల్యాంకనం చేసి సరైన మార్కులు వేయడం కూడా ఉపాధ్యాయులకు అంతే ముఖ్యం. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దేవారిని దారిలోకి తెచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నడుం బిగించింది. పదవ తరగతి, 12వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకన సమయంలో తప్పులు చేసిన టీచర్ల పేర్లను సెకండరీ బోర్డు ముద్రించే మాసపత్రికలో ప్రచురిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించిన 10, 12వ తరగతి పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఒకటి కన్నా ఎక్కువ తప్పులు చేసిన 6,500 మంది టీచర్ల పేర్లను తమ పత్రికలో ప్రచురిస్తామని గుజరాత్ హయ్యర్ సెకండరీ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మాసపత్రిక రాష్ట్ర వ్యాప్తంగా 17వేల సూళ్లకు సర్క్యులేట్ అవుతోందని బోర్డు చైర్మన్ ఏకే షా విలేఖరులకు తెలిపారు. అలాగే 10వ తరగతి పేపర్‌లో తప్పు చేస్తే రూ.50, 12వ తరగతి పేపర్‌లో తప్పుచేస్తే రూ.100 చొ ప్పున టీచర్ల నుంచి వసూలు చేస్తామని వెల్లడించారు. ఇదం తా మూల్యాంకన సమయంలో టీచర్లు జాగ్రత్తగా ఉండడం కోసమేనన్నారు. ఇలాంటి ప్రతిపాదన 2002లోనే వచ్చినప్పటికీ ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకున్నామని చెప్పారు.