జాతీయ వార్తలు

ఉన్నతస్థాయి విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి రాసిన పుస్తకం అద్భుతంగా ఉన్నదని మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రశంసించారు. మంగళవారం ఢిల్లీలో జైపాల్ రెడ్డి రాసిన ‘టెన్ ఐడియాలజీస్’ పుస్తకాన్ని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పది సిద్ధాంతాలను క్రోడీకరిస్తూ జైపాల్ రెడ్డి చేసిన విశే్లషణ అత్యున్నత స్థాయిలో ఉన్నదని అన్నారు. అభిప్రాయాల చరిత్రను విశే్లషించటంలో జైపాల్ రెడ్డి విజయం సాధించారని కొనియాడారు. పది భావజాలాలపై జైపాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు, విశే్లషణ చదివితే మన ఆలోచనా విధానం ఎంతో పరిణతి చెందుతుందన్నారు. కొత్త యుగానికి చైనా, భారత్, ఆసియా దేశాలు పునాదులు వేశాయన్నది జైపాల్ రెడ్డి హేతుబద్ధంగా వివరించారన్నారు. తుపాకి గుండు మందు, ముద్రణా సదుపాయాలు పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అర్థం చేసుకోవటంతోపాటు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు జైపాల్ రెడ్డి తన పుస్తకంలో కొత్త పద్ధతులు, మార్గాలను సూచించారని మన్మోహన్ చెప్పారు. ఉత్తరాదిలో తలెత్తుతున్న స్థానికత, స్వదేశీ వస్తు రక్షణ విధానం మూలంగా ప్రపంచం సమస్యల సుడిగుండంలో పడిపోతోందని హెచ్చరించారు. జైపాల్ రెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవేగౌడ, మాజీ మంత్రులు చిదంబరం, దినేష్ త్రివేది, జైరాం రమేష్, మాజీ ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీ(యూ) మాజీ నాయకుడు శరద్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంటు సభ్యులతోపాటు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..‘టెన్ ఐడియాలజీస్’ పుస్తకావిష్కరణ చేస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్