జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాక్‌కు సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ముస్లిం మహిళల హక్కుల భద్రత కోసం తీసుకొచ్చిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు మూడు సవరణలతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలుత భర్తకు బెయిల్ మంజూరుకు ఆస్కారం లేకుండా
నాన్‌బెయిలబుల్ అని పొందుపరిచారు. ఇప్పుడు దాన్ని బెయిలబుల్ కింద సవరించి ఆమోదం తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.‘ముస్లిం మహిళల వివాహపుహక్కులు భద్రత బిల్లు’కు
లోక్‌సభ ఇంతకు ముందే ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఆమోదం లభించాల్సి ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగియనుండడంతో సవరించిన ముమ్మారు తలాక్ బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. తరువాత సవరించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపాలి. సవరించిన బిల్లు ప్రకారం ముమ్మారు తలాక్ చేప్పిన భర్తకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. అయితే కోర్టుకు వెళ్లి అతడు బెయిల్ పొందవచ్చు. నాన్‌బెయిలబుల్ చట్టం కింద పోలీసులు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. ఒక వేళ్ల భార్యాభర్తలు కలిసి ఉండాలని భావించే పక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు వీలు కల్పించినట్టు తెలిపారు. భార్య వాదన విన్నతరువాతే భర్తకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని ఆయన వెల్లడించారు. తాను, తన బిడ్డల బతకడం కోసం పరిహారం కోసం బాధితురాలు న్యాయమూర్తిని ఆశ్రయించాలి. న్యాయమూర్తి సంతృప్తి చెందితేనే భర్తకు బెయిల్ మంజూరవుతుంది. బాధితురాలు( భార్య), ఆమె రక్తసంబధీకులు, పెళ్లి కారణంగా బంధుత్వం కలిసిన వారు మాత్రమే ఫిర్యాదు చేస్తేనే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.