జాతీయ వార్తలు

దేశంలో 298 మంది విదేశీ పైలెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: పౌర విమానయాన సంస్థల్లో 298 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని, వీరిని తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచించింది. భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాల్లో ఫారిన్ ఎయిర్‌క్య్రూ టెంపరరీ ఆథరైజేషన్ (ఎఫ్‌ఏటీఏ) ద్వారా విదేశీ పైలైట్లు పనిచేసేందుకు 2020 డిసెంబర్ 31వరకు అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా గురువారం లోక్‌సభలో తెలిపారు. ఆ విధంగా 298 మంది విదేశీ పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారని పౌర సిన్హా వెల్లడించారు. వచ్చే ఎనిమిదేళ్లలో 1043 విమానాలతోపాటు 12,516 మంది పైలెట్లు అవసరమవుతారని ఆయన వివరించారు. ఆయా విమాన సంస్థలు విదేశీ పైలెట్లపై ఆధారపడకుండా సొంతంగానే పైలెట్లను తయారు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇలావుండగా ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ వద్ద నిర్మించనున్న కొత్త ఎయిర్‌పోర్టుకు రూ.15,754 కోట్లు ఖర్చుకానున్నట్లు మంత్రి వివరించారు.