జాతీయ వార్తలు

ఆగస్టు క్రాంతి మైదాన్‌లో అమరవీరులకు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 9: భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమం 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు చారిత్రక నేపథ్యం ఉన్న ఇక్కడి ఆగస్టు క్రాంతిమైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు ఘనంగా నివాళి అర్పించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక ఘట్టంగా భావించే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమరంలో తమ ప్రాణాలను అర్పించిన సమరయోధులకు పుష్పాంజలి ఘటించారు. ఇదే గ్రౌండ్ నుంచి నాడు మహాత్మాగాంధీ స్వాతంత్య్రం తెచ్చుకోవడమో-ప్రాణాలు అర్పించడమో అని ఇచ్చిన నినాదాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘మనకు స్వాతంత్య్రాన్ని తేవడానికి తమ ప్రాణాలను అర్పించిన వారందరికీ ఇవే నా నివాళులు’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. వారి త్యాగఫలాల వల్లే బ్రిటీష్ వారి కబంధ హస్తాల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఇప్పుడు ఈ ఆగస్టు క్రాంతి మైదానం నుంచి కొత్త భారత్‌ను చూడగలుగుతున్నామన్నారు. ప్రజలందరూ సంఘటితంగా ఉండి మనకు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను అధిగమంచి అభివృద్ధి దిశగా ముందడుగు వేద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావెడే అన్నారు. ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాట్లాడుతూ నాడు స్వాతంత్య్ర పోరాటంలో తమ పాత్ర ఏమాత్రం లేనివారు నేడు దేశాన్ని పాలిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారన్నారు. కాగా, భారత్‌కు తక్షణం స్వాతంత్య్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ 1942లో ముంబయిలోని గొవాలియా ట్యాంక్ వద్ద క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఆగస్టు క్రాంతి మైదానంగా మార్చారు.