జాతీయ వార్తలు

ఒక్క పౌరుడికీ అన్యాయం జరగనీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ)లో తప్పులు సవరించేలా చర్యలు తీసుకోవాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఒక భారతీయ పౌరుడికి అన్యాయం జరగకూడదని వారన్నారు. కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, వాపపక్షాలకు చెందిన నాయకులు గురువారం రాష్టప్రతి కోవింద్‌తో భేటీ అయ్యారు. ఎన్‌ఆర్‌సీలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడం అత్యంత దారుణమని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలని రాష్టప్రతికి వారొక వినతిపత్రం అందించారు. జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం, లౌకిక సూత్రాలంటే కేంద్రానికి ఏమాత్రం గౌరవం, బాధ్యత లేదని ప్రతిపక్ష నేతల బృందం ఆరోపించింది. పైగా సూప్రీం కోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నామంటూ తప్పుదోవపట్టిస్తోందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్‌ఆర్‌సీలో దేనికీ చెందకుండా పోయిన 40 లక్షల మందిలో బెంగాల్, అసోం, రాజస్థాన్, బిహార్, పంజాబ్‌కు చెందిన వారు ఎందరో ఉన్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, దక్షిణ భారత దేశానికి చెందిన గిరిజనులు ఎన్నో ఏళ్ల క్రితం అస్సాం వెళ్లి స్థిరపడిపోయారని నేతలు వెల్లడించారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలపైనే దాడి చేస్తోందని వారు ఆరోపించారు. రాజ్యాంగం, పార్లమెంట్, న్యాయవ్యవస్థ, మీడియాను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని రాష్టప్రతికి ఫిర్యాదు చేశారు. ఎన్‌ఆర్‌సీ నుంచి ఒక్క దేశ పౌరుడి పేరు తొలగించడానికి వీల్లేదని వారు స్పష్టం చేశారు. రాష్టప్రతి కోవింద్‌కను కలిసిన బృందంలో కాంగ్రెస్ నేతలు ఆనంద్‌శర్మ, తృణముల్ నేత సుదీప్ భంద్యోపధ్యాయ, సీపీఎం నేత మహ్మద్ సలీమ్, జేడీఎస్ నేత దేవెగౌడ, టీడీపీ నేత వైఎస్ చౌదరి, ఆప్‌నేత సంజయ్ సింగ్ ఉన్నారు.