జాతీయ వార్తలు

ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 22 శాతం అజ్ఞాత విరాళాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలకు వస్తున్న ఆదాయంలో 22 శాతం విరాళాలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినవేనని ఒక సంస్థ నివేదికలో వెల్లడించింది. అసలు మనదేశంలోని ప్రాంతీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి, ఎంతెంత వస్తున్నాయి, వాటికి విరాళాలు ఇస్తున్న వారెవరు? అన్న వివరాలను తెలుసుకునేందుకు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ దేశంలోని 37 ప్రాంతీయ పార్టీలపై ఈ సర్వే నిర్వహించింది. దేశంలోని 29 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం 2016-17 సంవత్సరంలో 347.74 కోట్లని, అందులో 77 కోట్లు (22 శాతం) అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన విరాళాలేనని తెలియజేసింది. 91.29 కోట్లు (26.25 శాతం) తెలిసిన వ్యక్తులు/సంస్థలు విరాళంగా ఇచ్చాయి. ఇతర మొత్తాలుగా వచ్చినవి 179.37 కోట్లు (51.58 శాతం) అని వెల్లడైంది. ఆస్తుల అమ్మకం, మెంబర్ షిప్ ఫీజు, బ్యాంకు వడ్డీ, ప్రచురణల అమ్మకం, పార్టీ లెవీ ద్వారా ఇతర ఆదాయం వచ్చినట్టు తెలియజేసింది. మొత్తం 37 పార్టీలపై సర్వే చేపట్టగా, అందులో 29 మాత్రమే ఆదాయపుపన్ను రిటర్నులు, ఇతర నివేదికలు సమర్పిస్తున్నాయి. మిగిలిన ఎనిమిది పార్టీలు వీటి గురించి అసలేమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక సెక్టార్‌ల వారీగా ఈ విరాళాలను విభజిస్తే 60.42 శాతం విరాళాలు కార్పొరేట్/బిజినెస్ సంస్థల నుంచి 38.74 శాతం వివిధ వ్యక్తుల నుంచి వచ్చాయి. శివసేన, శిరోమ ణి అకాళిదల్, ఎస్పీ, ఎంఎన్‌ఎస్, ఆర్‌ఎల్‌డి, కెసి- ఎం తదితర పార్టీలు తమకు వచ్చిన విరాళాల్లో 83 శాతం కార్పొరేట్/వ్యాపార సంస్థల నుంచి వ చ్చినవేనని ప్రకటించాయి. అలాగే 16 ప్రాంతీయ పార్టీలు తమకు వచ్చిన విరాళాల్లో 84 శాతం వ్యక్తిగతంగా వచ్చాయని తెలిపాయి. అయితే శివసేన, ఆప్, జేడీఎస్ ఈ మూడు పార్టీలు మాత్రం తమ కు ఎక్కువగా యూనియన్/పార్టీ యూనిట్లనుంచి విరాళాలు వచ్చినట్టు వెల్లడించాయి. డీఎంకె, మ హారాష్ట్ర మరఠ్వాడి గోమంతక్ పార్టీ, ఆప్ పార్టీలు 2016-17 సంవత్సరానికి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే విరాళాలుగా సేకరించినట్టు చెప్పాయి. అయితే ఇవే పార్టీలు యూనియన్/పార్టీ యూనిట్లనుంచి 68 లక్షలు వసూలు చేసినట్టు తెలిపాయి. విరాళాలను 20 వేలు, అంతకు మించి, 20 వేల లోపు విభాగాలుగా విభజించారని, 20 వేలు అంతకు మించి విరాళంగా ఇచ్చిన వారి వివరాలను పార్టీలు ప్రజలకు అందుబాటులో ఉంచాయని, 20 వేల కంటే తక్కువ ఇచ్చిన వారిగురించి అవి చెప్పలేకపోయాయని ఏడిఆర్ తెలిపింది. వాస్తవానికి ఈ ప్రాంతీయ పార్టీలకు పెద్దయెత్తున వస్తున్న విరాళాల దాతల వివరాలు ప్రజలకు తెలియడం లేదని ఏడిఆర్ పేర్కొంది.