జాతీయ వార్తలు

గిరిజనుల కోసం ఏకలవ్య పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: గిరిజన పిల్లలకోసం ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పాలని టీఆర్‌ఎస్ ఎంపీ సీతా రాం నాయక్ డిమాండ్ చేశారు. గు రువారం లోక్‌సభ జీరో అవర్‌లో నా యక్ మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా విద్య అందుబాటులోకి రావటం లే దన్నారు. ఆగస్టు 9న విశ్వ ఆదివాసు ల దినోత్సవంగా జరుపుకుంటారని, ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రాన్ని కోరినా ఫలి తం లేదని అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ఫో ల్క్ అండ్ ఆర్ట్ అకాడమీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్డు కులాలు, తెగల అత్యాచార నిరోధక చట్టాన్ని తూ.చ. తప్పకుండా అమ లు చేయటం ద్వారా గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించాలని లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు.

చిత్రం..‘విశ్వ ఆదివాసి దివస్’ సందర్భంగా గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీ