జాతీయ వార్తలు

మాటల్లోనే ప్రేమ.. చేతల్లో వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్‌లో గురువారం కూడా తమ నిరసనను కొనసాగించారు. గాంధీ విగ్రహం వద్ద విభజన హామీలు అమలు చేయాలంటూ ప్లకార్డులను చేతబట్టి నినాదాలిచ్చారు. ప్రతిరోజు ఏదో ఒక వేషంలో కేంద్రంపై నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హిట్లర్ వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఎంపీ నిమ్మల కిష్ణప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మాటల్లో మాత్రమే వాటాలిచ్చిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేంకంగా ‘చేతల్లో మోసాలు చేశారు’ అనే కొత్త నినాదం ఇచ్చారు.
రెండు పార్టీలూ మోసం చేశాయి
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేశాయని, అందుకే రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికిగాని, విపక్షాల అభ్యర్థికిగాని తాము మద్దతు ఇవ్వలేదని వైఎస్సాఆర్ కాంగ్రెస్ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విభజన అనంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రత్యేకహోదా అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచకుండా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేవలం మాటగా చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. మరోవైపు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బీజేపీ కూడా మోసం చేసిందని విమర్శించారు. ఏపీకి ద్రోహం చేసిన ఈ రెండు పార్టీలతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
టీడీపీకి మరో పరాజయం
రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో ఏన్డీయే అభ్యర్థి విజయం టీడీపీకి మరో పరాజయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. అవినీతితో కురుకుపోయిన టీడీపీ ప్రభుత్వానికి చీత్కారం తప్పదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కాస్తా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఒకసారి, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునిచ్చి మరోసారి టీడీపీ పరాజయం పాలైందని జీవీఎల్ విమర్శించారు.

చిత్రం..హిట్లర్ వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్