జాతీయ వార్తలు

రక్షణ మంత్రిది సవతి ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: కొత్త సచివాలయం, రోడ్ల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా గ్రౌండ్‌ను కేటాయించేందుకు అప్పటి రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించినా ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తాత్సారం చేస్తూ తెలంగాట్ల పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఆంధ్రాకు సహాయం చేస్తున్నారు తప్ప తెలంగాణకు చేసేందుకు ముందు కు రావటం లేదని విమర్శించారు. పాత సచివాలయం పట్టిలగూడులా ఉన్నది. దాని స్థానంలో ఆధునిక సచివాలయాన్ని నిర్మించేందుకు, జాతీయ, రాష్ట్ర రాహదారులను విస్తరించటం ద్వారా కరీంనగర్ జిల్లా వైపు అభివృద్ధిని విస్తరించేందుకు రక్షణ శాఖకు చెందిన 200 ఎకరాల భూమిని తెలంగాణకు కేటాయించాలని తాము మూడేళ్లనుండి చెప్పులు అరిగేలా కేంద్రం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని దుయ్యబట్టారు. కొన్ని రోజుల క్రితమే కర్నాటక రాష్ట్రానికి రక్ష ణ శాఖ 210 ఎకరాల భూమిని బదిలీ చేసింది.. కర్నాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వారం పది రోజుల్లో వారికి భూమిని బదలాయించిన నిర్మలా సీతారామన్ తమ ఆకాంక్షను పట్టించుకోటం లేదని ఎంపీ తీవ్రంగా ఆరోపించారు. ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 1 రోడ్డు విస్తరణకు 22.58 ఎకరాల రక్షణ భూమిని తమకు కేటాయించాలని చాలాకాలం నుండి కోరుతున్నా పట్టించుకోకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ పట్ల పక్షపాతం చూపిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు.