జాతీయ వార్తలు

త్రిపుల్ తలాక్ బిల్లుకు లభించని మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో తక్షణ తలాక్‌ను నేరంగా ప్రకటించేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం రాజ్యసభలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో చర్చకు చేపట్టటం లేదని చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం సభలో ప్రకటించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ప్రభుత్వం ఎందుకింత తొందరపడుతోందంటూ ప్రతిపక్షాలన్నీ ఎదురు తిరగటంతో ప్రభుత్వం తమ ప్రయత్నాలను విరమించుకోవలసి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో మూడు సవరణలతో కూడిన త్రిపుల్ తలాక్ బిల్లుకు పచ్చ జెండా ఊపటం తెలిసిందే. సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని నిషేధించటం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్డీఏ
ప్రభుత్వం ఈ ట్రిపుల్ తలాక్ బిల్లును తెస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి ట్రిపుల్ తలాక్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం రాజ్యసభలో ప్రతిపాదించి చర్చ జరపటంతోపాటు ఆమోదించి లోకసభకు పంపించాలని నిర్ణయించింది.
ప్రతిపక్షం అంగీకరిస్తే నేటితో ముగుస్తున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వచ్చే వారం మంగళవారం వరకు పొడిగించి ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోకసభ ఆమోదం కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించిన అనంతరం దీనిపై మొదట బి.జె.పి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడైన అమిత్ షా ప్రసంగించాలనేది కూడా నిర్ణయించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ అంశంపై లోకసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్‌తోపాటు ప్రతిపక్షాలు, మిత్రపక్షాల నాయకులతో చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రతిపక్షాలకు ఎంత మాత్రం గిట్టలేదు. ట్రిపుల్ తలాక్ లాంటి అత్యంత వివాదాస్పద, సున్నిత బిల్లును ఇలా క్షణాలపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతపాదించి ఆమోదించటం మంచిది కాదని భావించిన ప్రతిపక్షం ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరించింది. ముందు నిర్ణయించిన ప్రకారం పార్లమెంటు ఉభయ సభలను ఈరోజు నిరవధికంగా వాయిదా వేయవలసిందేనని ప్రతిపక్షం స్పష్టం చేయటంతో ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించటం కష్టమైపోయింది. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించే అంశంపై ప్రతిపక్షాలను ఒప్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం ఉదయం నుండే ప్రయత్నాలు ప్రారంభించింది. న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తదితరులు ఈరోజు ఉదయం నుండే ప్రతిపక్షాలు, మిత్రపక్షాల నాయకులతో చర్చలు ప్రారంభించారు. బిల్లును ఆమోదిస్తే అందరికి మంచి పేరు వస్తుందంటూ వారు ప్రతిపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షం మాత్రం ట్రిపుల్ తలాక్ బిల్లుపై మరింత చర్చ జరిపేందుకు దీనిని రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించాలని పట్టుపట్టింది. దీనితో ట్రిపుల్ తలాక్ బిల్లును చేపట్టే కార్యక్రమం పార్లమెంటు శీతాకాల సమావేశాలకు వాయిదా పడింది. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ బిల్లును లోకసభ గత డిసెంబర్‌లో ఆమోదించటం తెలిసిందే. ఇప్పుడు సవరణలతో కూడిన ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించినా మూడు సవరణల దృష్టా దీనిని మళ్లి లోకసభ ఆమోదం కోసం పంపించవలసి ఉంటుంది.