జాతీయ వార్తలు

నిరుద్యోగుల ఆశలు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కాలంలో జరుగుతున్న వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజీ కావడంతో ఆయా పరీక్షలకు వేలాది రూపాయలు వెచ్చించి సిద్ధమై, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు గల్లంతవుతున్నాయి. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల ఒకపక్క తాము నష్టపోవడమే కాకుండా అటుపక్క ప్రభుత్వం కూడా అప్రతిష్టను మూటకట్టుకుంటోందని పలువురు నిరుద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. గతవారం ట్యూబ్‌వెల్ ఆపరేటర్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజీ కావడంతో గందరళగోళం నెలకొంది. తమ రాష్ట్రంలో గత కొనే్నళ్లలో చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగిన ఉదంతాలు ఉన్నాయని, ఇది ఒకవిధంగా ప్రభుత్వానికే మాయని మచ్చ తీసుకువస్తుందని లక్నోకు చెందిన హిమాంశు కుమార్ (అతని కోరికపై పేరు మార్చాం) అనే యువకుడు వ్యాఖ్యానించాడు.
గత ఆదివారం ట్యూబ్‌వెల్ ఆపరేటర్ పరీక్షను ఫైజాబాద్‌కు చెందిన తన స్నేహితుడు మహేందర్ సింగ్ (ఇతని పేరు కూడా మార్చాం)తో కలసి రాసేందుకు వచ్చినట్టు తెలిపాడు. తాము పరీక్ష కేంద్రానికి చేరుకునేసరికే వాట్సాప్‌లో ఒక ప్రవేశపరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకేజీ అయిందని మెసేజ్ వచ్చిందన్నాడు. అయినా తాము ధైర్యం చేసి తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి వెళ్లేసరికి నిజానిజాలు తెలియడంతో నిర్ఘాంతపోయామని వాపోయాడు. ఆ ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో దానిని రద్దుచేయడంతో ఇంతవరకు ఆ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వెచ్చించిన ఖర్చుతోపాటు శ్రమ, ఏడాదిపాటు సమయం వృథా అయిందని వాపోయాడు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు తమలాంటి నిరుద్యోగుల పాలిట ఆశనిపాతంలా పరిణమిస్తున్నాయని, ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.
ఇలాంటి సంఘటనే ఈ ఏడాది జూలైలో జరిగిన అసిస్టెంట్ టీచర్స్ పోస్టుల ప్రవేశ పరీక్ష, జూన్‌లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల ప్రవేశ పరీక్ష, జూలైలోనే సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం జరిగిన ఆన్‌లైన్ ప్రవేశపరీక్ష వంటివి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.