జాతీయ వార్తలు

గుజరాత్ రచయిత భగవత్‌కుమార్ శర్మ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, సెప్టెంబర్ 5: గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు భగవత్‌కుమార్ (84) బుధవారం సూరత్‌లోని తన స్వగృహంలో కన్నుమూసారు. సాహిత్య అకాడమీ అవార్డు సహా పలు పురస్కారాలు, గౌరవాలను అందుకున్న ఈయన వృద్ధాప్య కారణాలతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భగవత్‌కుమార్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత భగవతీకుమార్ శర్మ భాష, సాహిత్య రంగాలకు చేసిన సేవలు ఎనలేనివని మోదీ ట్వీట్ చేశారు. సాహిత్యలోకానికి ఆయన మరణం తీరని లోటని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అలాగే గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చవడా, ఇతర నేతలు శర్మ మృతికి సంతాపం తెలిపారు. 1934లో జన్మించిన భగవతీకుమార్ శర్మ చిన్నకథలు, కవితలు, వ్యాసాలు, ఆర్టికల్స్ రాశారు. 1988లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఆయన రాసిన ‘అసూర్యలోక్’ నవలకు ఈ అవార్డు లభించింది. 2017లో గుజరాత్ సాహిత్య అకాడమీ ఆయనను సాహిత్యరత్నతో సత్కరించింది.