జాతీయ వార్తలు

జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఉద్యోగ భద్రత కోసం ఊగిసలాడుతున్న జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సామాజిక భద్రత కరువైన జర్నలిస్టులు వృత్తికి న్యాయం చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడి ఐఐఎంసీ క్యాంపస్‌లో బుధవారం జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం జర్నలిజంలో తరచూ ‘పింక్ స్లిప్’ అనే మాట ప్రతిధ్వనిస్తోందని, ఈరోజు డ్యూటీకి వెళ్లిన ఎడిటర్ లేదా రిపోర్టర్, జర్నలిస్టు ఆడ లేదా మగ ఎవరైనా రేపటివరకు కొనసాగుతాడన్న గ్యారంటీ ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు హక్కులు కూడా ఎంతో ముఖ్యమని, వారికి సామాజిక భద్రత కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. సామాజిక కొరవడిన జర్నలిస్టు ఎవరైనా తాను చేస్తున్న పనిలో నిజాయితీగా, అనుకున్న రీతిలో వ్యవహరించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ హక్కులపై అధ్యయనం చేయడం ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని ఆయన జర్నలిస్టులకు హితవు పలికారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న నేపథ్యంలో ప్రజలను విద్యావంతులను చేయడంలో మీడియా సమర్థవంతమైన పాత్రను పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా వార్తల సేకరణ, ప్రచురణ విషయంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించాల్సిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు మాట్లాడుతూ మానవహక్కుల గురించి తెలుసుకోవడం, ఉల్లంఘన తదితర అంశాల్లో సభ్యసమాజానికి సుదూరంగా ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజానీకాన్ని సైతం చైతన్యవంతులను చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సమావేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) డైరెక్టర్ జనరల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.