జాతీయ వార్తలు

పంజాబ్ టీచర్ల మూకుమ్మడి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 5: పే స్కేలు పెంపులతోపాటు ఎంతోకాలం నుండి అపరిష్కృతంగా ఉన్న పలు డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రాష్ట్రంలో ఆరువేలకు పైగా ప్రభుత్వం, ప్రభుత్వేతర కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులు మూకుమ్మడి సెలవు పెట్టారు. ఒక్కసారిగా వేలాదిమంది టీచర్లు సెలవు పెట్టడంతో రాష్టమ్రంతటా ఆందోళన నెలకొంది. పం జాబ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ, కాలేజీ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (పీఎఫ్‌యూసీటీఓ) సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. యూసీజీ సిఫార్సు చేసిన 7వ వేతన కమిషన్ మేరకు కళాశాల, యూనివర్సిటీ టీచర్లకు పే స్కేలు వర్తింపజేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే హర్యానాతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో 7వ వేతన కమిషన్ మేరకు పే స్కేలు చెల్లిస్తున్నాయని, కానీ తమ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో విఫలమైందని పీఎఫ్‌యూసీటీఓ ప్రధా న కార్యదర్శి జగ్‌వంత్ సింగ్ తెలిపారు. యూజీసీ సైతం ఉపాధ్యాయులను నూతన పే స్కే లు అమలు చేయాలని కోరిందని, కానీ ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలల్లో హైరింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయులను తీసుకోకపోవడాన్ని ధర్నాలో పా ల్గొన్న పలువురు ఖండించారు. కొత్తగా రిక్రూట్‌మెం ట్ లేనపుడు ప్రభుత్వ కళాశాలల్లో విద్యాప్రమాణాలు ఏవిధంగా మెరుగుపడతాయని ప్రశ్నించారు. ప్రభు త్వ కళాశాలల్లో 30శాతం మంది టీచర్లు, ప్రొ ఫెసర్లు పనిచేస్తున్నారని, 60 ప్రభుత్వ కాలేజీల్లో 1300 టీచ ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు అన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లో 90 శాతం బోధనా సిబ్బంది ఉండాలని అన్నారు.