జాతీయ వార్తలు

సరళంగా, అర్థమయ్యేలా భాషను వాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: అధికార కార్యకలాపాల్లో సామాన్యులకు అర్ధమయ్యేలా హిందీ భాషను వాడాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. సంక్లిష్టమైన పదాలు వాడడం మానుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆయన ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సెంట్రల్ హిందీ కమిటీ సమావేశం జరిగింది. హిందీ భాషను విస్తృత పరచాలని ప్రధాని పిలుపునిచ్చారు. రోజురోజుకూ హిందీకి ప్రాచుర్యం లభిస్తోందని, దానికి తగ్గట్టే అందరికీ అర్థమయ్యేలా పదాలను వాడాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మోదీ చేసిన ప్రసంగ పాఠాన్ని పీఎంఓ విడుదల చేసింది. ప్రభుత్వం, సమాజం మధ్య హిందీ భాష వాడుకకు సంబంధించి దూరాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ తెలిపారు. జాతీయ భాషను జనాల్లోకి తీసుకెళ్లేందుకు హిందీ విద్యా సంస్థలు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన విదేశీ పర్యటనల్లో అనుభవాలను కమిటీ సభ్యులతో పంచుకున్నారు. ‘విదేశాల్లో మన భాష, హిందీ సహా మట్లాడితే అక్కడ మన వాళ్ల మదిని దోచుకుంటాం. వారికి మరింత దగ్గరవుతాం’అని ప్రధాని సూచించారు. ఈ సమావేశానికి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.