జాతీయ వార్తలు

విపక్షాల కూటమిలో ఎప్పటికీ రాహులే అధినేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఒకపక్ష విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడాలని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ఎంపీ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఒకవేళ మహాకూటమి ఏర్పడితే ప్రధాని పదవిని ఎవరికి ఇస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని, ఇప్పుడైనా, రేపైనా, కొన్నిరోజుల తర్వాతైనా సహజంగా తమ తోటి విపక్ష నేతలకు సహజంగానే నాయకత్వం వహిస్తాడని అన్నారు. పాండిచ్చేరి నుంచి జమ్మూ వరకు ప్రజలకు తెలిసిన ఏకైక నేత ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారని, అతడిని తమ నేతగా అంగీకరిస్తున్నారని, ఈ నేపథ్యంలో నేడు కాకపోతే రేపైనా అతని నాయకత్వాన్ని అందరూ అంగీకరించి తీరుతారని ఆయన పేర్కొన్నారు.
అన్ని పార్టీలతో ఒకవేళ మహాకూటమి ఏర్పడితే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మిగిలిన పార్టీలు అంగీకరిస్తాయా? అన్నప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారో ఎన్నికల 2019 అనంతరమే నిర్ణయం జరుగుతుందని, అయితే మన ముందున్న ప్రథమ కర్తవ్యం బీజేపీని అధికారంలోంచి దించడానికి అందరూ ఒక్కటవ్వడమని ఆయన అన్నారు. బీజేపీని దించడానికి జరిగే ఈ ఎన్నికల యుద్ధానికి అప్రయత్నంగానే రాహుల్ నాయకత్వం వహిస్తారని అన్నారు. ఈ విషయంలో అందరి సహకారం అవసరమని అన్నారు. ఎన్నికల ముందు అందరూ ఐక్యమవుతారని, అన్ని విషయాలు కూలంకషంగా చర్చిస్తారని ఆయన చెప్పారు. రాహుల్ పట్ల ప్రజలకు ఉన్న మద్దతులాగే తోటి విపక్ష పార్టీల మద్దతు కూడా ఆయనకు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీని గద్దె దించాలంటే తొలుత అందరూ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. వాస్తవానికి దేశ ప్రజలంతా రాహుల్‌వైపు చూస్తున్నారని, ఈ నేపథ్యంలో అతని నాయకత్వామే దేశానికి కూడా అవసరమవుతుందని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్‌గాంధీ చేపట్టడానికి సోనియా గాంధీ ఎలా అంగీకరించారో, అలాగే విపక్ష దిగ్గజాలైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బిఎస్పీ చీఫ్ మాయావతి, ఎన్‌సిపి సుప్రీం శరద్ పవార్ లాంటి దిగ్గజ నేతలు సైతం రాహుల్‌ను తమనేతగా అంగీకరిస్తారని ఆయన అన్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయన ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా వింటున్నారని, ఇలా పాండిచ్చేరి నుంచి జమ్మూకాశ్మీర్, బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రజలు ఎవరినైనా నాయకుడిని అంగీకరించే పరిస్థితి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అలా అని తాము ప్రతిపక్షాలను కించపరచడం లేదని, తప్పుడు విధానాలు అనుసరించి మళ్లీ బీజేపీకి అవకాశం ఇవ్వరాదని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. అస్తవ్యస్త పాలన కొనసాగిస్తున్న బీజేపీని గద్దె దించడానికి తాము ముందడుగు వేస్తున్నామని అన్నారు. తాము కర్నాటకలో ఎక్కువ సీట్లు సాధించినా తక్కువ సీట్లు ఉన్న కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.