జాతీయ వార్తలు

చర్చకు మేం సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: గత యూపీఏ, ఇప్పటి ఎన్డీయే పాలనలో దేశ ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా, బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే దేశ ఆర్థిక ప్రగతి సుస్థిరంగా, మెరుగ్గా ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2006-07లో 10.08 శాతం మేర దేశ ఆర్థిక పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి రికార్డు స్థాయిలో మెరుగుపడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితులపై వాస్తవాలేమిటో బహిరంగ చర్చ ద్వారా తెలియజేసేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన ప్రతిపక్షాలను నిలదీయాలని ఆ పార్టీ నాయకులను కోరిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన చిదంబరం ఎన్‌డీఏ-1, యూపీఏ-1, యూపీఏ-2, ఎన్‌డీఏ-2 హయాంలలో జరిగిన ఆర్థిక అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (సీఎస్‌ఓ) సహా డేటా ఆధారిత చర్చకు శ్రీకారం చుట్టిందని అన్నారు. సీఎస్‌ఓ సమకూర్చే డేటాను బీజేపీ అంగీకరిస్తుందో లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2006-07లో దేశ ఆర్థిక పరిస్థితి 10.08గా ఉన్న విషయాన్ని గత నెలలో కేంద్ర గణాంకాలు, పథకం అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1988-89లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక ప్రగతి 10.2గా ఉన్న విషయాన్ని రికార్డులే చెబుతాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-1 (8.87 శాతం), యూపీఏ-2 (10.08 శాతం) ప్రభుత్వాల హయాంలో అత్యధిక ఆర్థిక ప్రగతి నమోదైన విషయాన్ని ఆయన తెలిపారు.