జాతీయ వార్తలు

నకిలీ ఎన్‌కౌంటర్లపై వివరాల్వివండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: నకిలీ ఎన్‌కౌంటర్లపై సీఆర్‌పీఎఫ్ మాజీ ఐజీ రజనీష్ రాయ్ రూపొందించిన విచారణ నివేదికకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సమాచార కమిషన్ ఆదేశించింది. రెండుసార్లు ఈ విషయంపై లేఖలు పంపినా వివరాలు అందించడంలో జాప్యం చోటుచేసుకున్న క్రమంలో సమాచార కమిషన్ ఇలా మరో ఆదేశం జారీ చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఇలా ఆదేశించే హక్కు తమకుందని కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. అస్సాంలో రక్షణ దళాలకు చెందిన జాయింట్ ఫోర్సెస్ నిర్వహించిన నకిలీ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మృతిచెందిన ఘటనకు సంబంధించిన కేసు రికార్డులను తాము కోరామని సమాచార కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ తెలిపారు. మానవహక్కులకు విఘాతం కలిగించామన్న ఆరోపణలపై తప్ప మిగిలిన విషయాల్లో పోలీసులు తమ విచారణాంశాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారని సమాచార కమిషనర్ చెప్పారు. ఈ విషయంలో హోం మంత్రిత్వ శాఖకు చివరి అవకాశంగా విచారణ నివేదికకు సంబంధించిన ఫైళ్లను సమర్పించాల్సిందిగా కోరామన్నారు. అస్పష్టమైన ఏ విషయాలపైనైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం సంబంధిత శాఖలకు ఉందన్నారు. అలా చేయకపోతే సివిల్ కోర్టు హోదాలో తమకున్న విస్తృతాధికారాలను వినియోగించి సమన్లు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. 1992 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి (సీఆర్‌పీఎఫ్ మాజీ ఐజీ) రజనీష్ రాయ్ ఈ నకిలీ ఎన్‌కౌంటర్లపై విచారణ చేసి నివేదికను రూపొందించడం జరిగింది. ఆర్మీ, పోలీసు, సీఆర్‌పీఎఫ్ దళాలతో కూడిన అటవీ పోరాట దళం కోబ్రాగా ఏర్పాటై సరిహద్దు రక్షణ దళం సషష్త్రా సీమబాల్‌తో కలిసి సంయుక్తంగా 2017 మార్చి 29, 30 తేదీల్లో చిరాగ్ జిల్లా సిమ్లగురి ప్రాంతంలో ఎదురు కాల్పులు నిర్వహించాయి. ఈ సందర్భంగా నిషేధిత బోరోల్యాండ్ సంగిబిజిత్ నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఆ దళాలు కస్టడీలో కాల్చి చంపి ఏన్‌కౌంటర్‌గా చిత్రీకరించారన్న అభియోగం ఉంది.