జాతీయ వార్తలు

దేశ భద్రతతో రాజీపడ్డారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో దేశ భద్రతతో రాజీ పడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని ఆరోపించారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో తప్పుచేసిన మోదీ ప్రభుత్వాన్ని క్షమించే ప్రసక్తే లేదన్నారు. యూపిఏ ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం తక్కువ ధరకు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోందంటూ మోదీ ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధమని ఆంటోని ఆరోపించారు. ఇదే నిజమైతే మోదీ ప్రభుత్వం కేవలం 36 యుద్ధ విమానాలనే ఎందుకు కొనుగోలు చేస్తోంది.. మొత్తం స్క్వాడ్రన్‌కు అవసరమయ్యే 126 యుద్ధ విమానాలను ఎందుకు కొనుగోలు చేయటం లేదని ఆయన నిలదీశారు. భారత వాయుసేనలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య 42 ఉండాలి. ప్రస్తుతం వాయుసేనలో 31 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. భద్రతా దళాల సంసిద్ధతను కాపాడేందుకు అర్జెంటుగా 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని వాయుసేన ఎప్పుడో స్పష్టం చేసింది. అయినా ఎన్‌డీఏ ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోలులో తాత్సారం చేస్తూ, దేశ భద్రత విషయంలో రాజీపడుతోందని ఆంటోని దుయ్యబట్టారు. చైనా, పాకిస్తాన్ నుండి ప్రమాదం ముంచుకువస్తున్న నేపథ్యంలో యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఎంతమాత్రం సహించరానిదని అన్నారు. దేశానికి రెండు వైపుల నుండి ప్రమాదస్థాయి రోజురోజూకు పెరుగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. కేవలం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయటం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం వాయుసేన యుద్ధ తయారీని బాగా దెబ్బతీసిందని ఆంటోని చెప్పారు. తమకు 126 యుద్ధ విమానాల అవసరం ఉన్నదని వాయుసేన 2000లో అంచనా వేసిందని, ఇప్పుడు యుద్ధ విమానాల అవసరం మరింత పెరిగిందని అన్నారు. అవసరం పెరుగుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం 36 యుద్ధ విమానాలతో సరిపెట్టటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యుపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఫ్రాన్స్ నుండి 16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసి మిగతా యుద్ధ విమానాలను భారత దేశంలోని హెచ్‌ఏఎల్‌లో తయారు చేయవలసి ఉంటుందని.. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరిందని ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూపీఏ ఒప్పందాన్ని పూర్తిగా మార్చివేశారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఏ అధికారంతో యుద్ధ విమానాల కొనుగోలును 126 నుండి 36కు తగ్గించారని ఆయన ప్రశ్నించారు. రక్షణ శాఖ కార్యదర్శి, త్రివిధ దళాల అధిపతులు సభ్యులుగా ఉంటే రక్షణ ఉత్పత్తుల సేకరణ కమిటీ మాత్రమే యుద్ధ విమానాల కొనుగోలు సంఖ్యను తగ్గించగలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం హెచ్‌ఏఎల్‌కు రాకుండా నరేంద్ర మోదీ అడ్డుకున్నారని ఆంటోని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం తక్కువ ధరకు రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే, మోదీ ప్రభుత్వం దీనిని రద్దు చేసి ఎక్కువ ధరకు యుద్ధ విమానాలు కొనుగోలు చేసే ఒప్పందం కుదుర్చుకున్నదని ఆయన ఆరోపించారు. దేశానికి ఆధునిక యుద్ధ విమానాలు రాకుండా చేయటంతోపాటు మన యువతకు ఉపాధి లేకుండా చేశారని ఆయన మోదీపై ఆరోపణలు కురిపించారు. యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌కు ఈ కాంట్రాక్టును ఎలా ఇస్తారని అంటోని ప్రశ్నించారు.