జాతీయ వార్తలు

సుప్రీం తీర్పు వినకుండానే కోమాలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 18: తనపై ఏర్పడిన కళంకం పూర్తిగా ఎప్పుడు తొలగుతుందా? తనపై వచ్చిన అపవాదుపోయి పూర్తి నిర్దోషిగా ఎప్పుడు బయటపడతానా అని దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఇస్రో మాజీ సైంటిస్టు తాను ఆశించిన తీర్పు గురించి వినకుండానే తుదిశ్వాస విడిచారు. సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి కొద్దిసేపటికి ముందే కోమాలోకి వెళ్లి రెండురోజుల తర్వాత కన్నుమూసారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) సైంటిస్టు నంబి నారాయణ సంస్థ రహస్యాలు చేరవేస్తున్నారన్న ఆరోపణపై 1994లో అరెస్ట్ చేసి గూఢచార్యం చేస్తున్నాడని అభియోగాలు నమోదు చేశారు. దానిపై రెండున్నర దశాబ్దాల పాటు సాగిన కేసు తుది తీర్పు శుక్రవారం సుప్రీం కోర్టు వెలువరించింది. ఈ కేసుతో అతనికి సంబంధం లేకపోయినా అతడిని అనవసరంగా అరెస్ట్ చేసి, మానసికంగా హింసించారని, కోర్టు పేర్కొంటూ అతడుపడ్డ మానసిక క్షోభకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అయితే విషాదమేమిటంటే సుప్రీం తీర్పు వెలువడటానికి కొద్దిసేపటి ముందే శుక్రవారం ఉదయం కోమాలోకి వెళ్లిన ఆయన కొలంబియా ఆసియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8.40 గంటలకు కన్నుమూసారు. ఆ రోజు తుదితీర్పు వస్తుందని, తాను నిర్దోషినని లోకానికి తెలుస్తుందని శుక్రవారం తెల్లవారుజామున తన భర్త ఎంతో ఉత్కంఠగా పేర్కొన్నారని, కాని ఆ తీర్పు పాఠం తెలుసుకోకుండానే కోమాలోకి వెళ్లి కన్నుమూసారని ఆయన భార్య కెజె విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. గాల్ బ్లాడర్‌లోని రాళ్లను తొలగించడానికి ఆయనకు ఆపరేషన్ జరిగిందని, ఆరోజు తెల్లవారుజామున 3.15 గంటలకు కాఫీ అడిగారని, తర్వాత కేసు తీర్పు ఈ రోజు వస్తుంది కదా అని ప్రశ్నించి, తాను తప్పక విజయం సాధిస్తానని అన్నారని విజయమ్మ తెలిపారు. ఎన్నో దశాబ్దాల పాటు ఎదురుచూసిన తీర్పులో ఆయన తాను నిర్దోషినన్న విషయం తెలుసుకోకుండానే కన్నుమూసారని ఆమె పేర్కొంది.
చంద్రశేఖర్ రష్యన్ స్పేస్ ఏజెన్సీ గ్లవకోస్మస్‌లో భారత్ ప్రతినిధిగా 1992 నుంచి పనిచేశారు. అయితే గూఢచార్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అప్పటిదాకా ఎంతో సాఫీగా సాగుతున్న తమ జీవితంలో ఆ సంఘటనతో తీవ్ర కలకలం రేగిందని విజయమ్మ తెలిపారు. ఆ సమయంలో తాను హెచ్‌ఎంటిలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నా కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించగలిగామని అన్నారు. తన భర్తపై ఆరోపణల నేపథ్యంలో తనను సైతం ఉద్యోగం నుం చి తొలగించడానికి ప్రయత్నాలు జరిగాయని ఆమె చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 1998లోనే నారాయణ, ఇతరులు నిర్దోషులని కోర్టు విడుదల చేస్తూ రూ.లక్ష పరిహారం సైతం చెల్లించాలని పేర్కొంది. నిర్దోషినైన తనపై కేసులు పెట్టి తన పరువుకు తీవ్ర నష్టం కలిగించారని, తీవ్ర మనోవేదనను మిగిల్చారని, దీనిపై తనకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ నారాయణన్ జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, అతనికి పది లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు 1998లో తీర్పు వెలువరించింది.