జాతీయ వార్తలు

రాహుల్ గాంధీ నకిలీ యువరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నకిలీ యువరాజని, ప్రధాని మోదీ ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. రాహుల్ గాంధీ మాటల్లో నిజం లేదని, అవాస్తవాలను చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నారు. ఫేస్‌బుక్‌లో రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు అరుణ్ జైట్లీ స్పందించారు. మొండి బకాయిలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. బీజేపీ కంటే ముందున్న యూపీఏ సర్కార్‌లో మొండి బకాయిలున్న 12 మంది పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ అదే జాబితాలో అదే స్థానంలో కొనసాగుతున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి బకాయిల వసూళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాఫెల్ ఒప్పందం, నిరర్థక ఆస్తుల విలువ తదితర అంశాల్లో రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో రాహుల్ గాంధీ అవాస్తవాలను చెప్పడం విపరీత ధోరణులకు దారితీస్తుందన్నారు. యూపీఏ ప్రభుత్వం ఎడాపెడా రుణాలు ఇచ్చిందని, వీటిని దాచిపెట్టి ఉంచిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని వెలికితీసిందన్నారు. బ్యాంకులను లూటీ చేసేందుకు యుపీఏ ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఇష్టానుసారం రుణాలు మంజూరు చేశారన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారనే ధోరణిలో రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. పరిణితి చెందిన భారత్ వ్యవస్థల్లో ప్రజలు ఇలాంటి సత్యదూరమైన అంశాలను నమ్మరన్నారు. ప్రజలు తప్పుడు హామీలతో రాజకీయాల్లో పైకి వస్తామనుకునే వారికి తగిన గుణ పాఠం చెబుతారన్నారు. మొండి బకాయిలు పడిన భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్ సంస్థల వ్యవహారాన్ని తమ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్నారు. యూపీఏ ప్రభుత్వం నిరర్ధక ఆస్తుల విలువను తగ్గించేందుకు ఏ రోజు ప్రయత్నం చేయలేదన్నారు. ఎన్‌పీఏలను తగ్గించకపోవడం వల్ల వడ్డీలు పేరుకుని బకాయిల విలువ పెరిగిందన్నారు. యూపీఏ ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనపరిచిందన్నారు. 12 మంది బకాయిదార్ల బకాయిలు వడ్డీలతో కలుపుకుని రూ.3 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఒక్క ఎగవేతదార్లను కూడా గత ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేయలేకపోయిందన్నారు. బ్యాంకులు ఇప్పుడిప్పుడే బకాయిల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశాయన్నారు. దివాలాప్రక్రియ స్మృతిని తెచ్చి వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. బ్యాంకుల బకాయిల రికవరీ ప్రక్రియ ప్రారంభమైందని, వేగవంతం చేసి బకాయిదార్ల భరతం పడుతామన్నారు.