జాతీయ వార్తలు

ప్రత్యేక ఆరోగ్య చానల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో ఆరోగ్య పౌష్టికాహార అంశాలను మరింతగా పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్ చానల్‌ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం బలంగా యోచిస్తోంది. ఆరోగ్యం, పౌష్టికాహార అవసరాలను ఉద్యమ ప్రాతిపదికన ప్రచారం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ చానలన్ ఏర్పాటు అంశాలన్ని పరిశీలిస్తున్నట్టుగా నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఈ చానల్ తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా ఆరోగ్యం, పౌష్టికాహార అంశాలను అంకితమయ్యే టెలివిజన్ చానల్‌ను ప్రారంభించడమన్నది మంచి ఆలోచన అని, దీనివల్ల ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలు మరింతగా చేకూరే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రజల్లో ఈ అంశాలపై అవగాహనతో పాటు ఆసక్తిని కలిగించేందుకు ఈ చానల్ ప్రసారాలు ఉపయుక్తమవుతాయని ఆయన అన్నారు. అయితే ఈ చానల్ అన్నది అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడేదిగా టెక్నాలజీ పరంగానూ సుస్థిరమైనదిగా ఉండాలని అన్నారు. దాదాపు 27 రాష్ట్రాలు జనారోగ్య పథకంలో క్రియాశీలకంగా పాల్గొనేందుకు ముందుకు రావడంతో ఈ చానల్ ఆలోచనకు మరింత ఊతనిచ్చేదే అవుతుందన్నారు.