జాతీయ వార్తలు

సుప్రీం తీర్పులు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్వలింగసంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను ఏకీభవించనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లైంగికత్వం అనేది వాక్‌స్వాతంత్య్రంలో భాగమని అభిప్రాయం సరికాదన్నారు. వాక్‌స్వాతంత్య్రంలో భాగమని చెప్పడం వల్ల పాఠశాలల హాస్టళ్లు, జైళ్లు, ఆర్మీలో స్వలింగసంపర్కం, ఉభయ లైంగిక సంపర్కంను నియంత్రించాలా వద్దా అనే సందేహాలు తలెత్తుతాయన్నారు. వివాహేతర సంబంధం అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల భారతీయ కుటుంబ వ్యవస్థ పాశ్చాత్య కుటుంబ జీవనంలా తయారవుతుందన్నారు. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించేందుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా తాను ఏకీభవించనన్నారు. దీని వల్ల సామాజికంగా అనేక పరిణామాలు ఉంటాయన్నారు. కొన్ని చోట్ల ఉండే ఆచారాలను ఎంపిక చేసుకుని తీర్పులు ఇవ్వడంపై తనకు కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయన్నారు. హిందూస్తాన్ టైమ్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వలింగ సంపర్కాన్ని పట్ల వివక్ష ప్రదర్శించడం సరికాదన్నారు. కాని చరిత్రలో భాగమవుతామన్న భావనలతో ఇటువంటి తీర్పులు వెలువడుతున్నాయన్నారు. లైంగిక కార్యకలాపాలు రాజ్యాంగంలో 21వ అధికరణ పరిధిలోకి వస్తాయన్న సుప్రీంకోర్టు అభిప్రాయంతో తాను ఏకీభవిస్తానన్నారు. అదే సమయంలో లైంగిక కార్యకలాపాలు వాక్‌స్వాతంత్య్రం కిందకు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వివాహేతర సంబంధాలపై వచ్చిన తీర్పు మహిళలకు వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈ కేసులోకొంత మంది న్యాయమూర్తులు వివాహసంబంధ నేరాలను, వ్యక్తిగత తప్పిదాలని, పబ్లిక్ తప్పిదాలు కావన్నారని చెప్పారు. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై మాట్లాడుతూ, ప్రగతిశీల వాదనను తెరపైకి తీసుకురాదలుచుకుంటే, 14, 21వ అధికరణలను అన్ని మతాలకు వర్తింపచేయాలన్నారు. అలా కాకుండా కొన్ని చోట్ల అమలులో ఉన్న ఆచారాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. బహు భార్యాత్వం, వౌఖికంగా ఆదేశాలతో విడాకులు ఇవ్వడం వంటి వాటిని కూడా రాజ్యాంగంలోని 14,21వ అధికరణలు వరిస్తాయా అని ఆయన అన్నారు. కొన్ని మతాల్లో మహిళలను అనుమతించరు. ఆ మతాలకు కూడా 14,21వ అధికరణలను వర్తింపచేయవచ్చన్నారు. మీరు ప్రగతిశీలురైతే దేశమంతా అందరికీ ఏకీకృత విధానాన్ని అమలు చేయవచ్చని ఆయన న్యాయ వ్యవస్థను ప్రశ్నించారు.
మహాకూటమి విఫలమవుతుంది
2019 ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటవుతున్న మహాకూటమి విఫలమవుతుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బలమైననాయకత్వం, స్థిరమైన ప్రభుత్వానికి, బలహీన నాయకత్వం, సైద్ధాంతిక దివాళాకోరు పార్టీలకు మధ్య పోరులో బీజేపీకే విజయం లభిస్తుందన్నారు. గతంలో చంద్రశేఖర్, వీపీసింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ఆధ్వర్యంలో సంకీర్ణప్రభుత్వాలు విఫలమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమపైన నమోదైన క్రిమినల్ కేసులు రద్దు కావాలనో, లేక అధికార దాహంతో ఏర్పాటయ్యే పార్టీల కూటములు తుస్సుమంటాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ ఆర్థికంగా బలోపేతమైన దేశంగా దూసుకుపోతోందన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో తనకు తెలున్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిణతి చెందాలని, అనేక అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరగడానికి యూపీఏ సర్కార్ అనుసరించిన విధానాలు కారణమన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం ద్వారా మొబైల్ ఫోన్లు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అనుసంధానం ప్రక్రియనుపునరుద్ధరించవచ్చని అరుణ్ జైట్లీ అన్నారు. కాని ప్రభుత్వానికి ఈ ఆలోచన ఉందాలేదా అనే విషయం తనకు తెలియదన్నారు. ఆధార్‌పై వెలువడిన తీర్పు విలువైనదన్నారు. ఆధార్‌కు రాజ్యాంగ బద్ధత ఉందని కోర్టు గుర్తించిందన్నారు. ఆధార్ ఒక పౌరసత్వ కార్డు కాదన్నారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వ నిధులతో అమలవుతున్నాయన్నారు. ఆదాయం పన్ను, పాన్ కార్డులకు సంబంధించి ఆధార్ కార్డును తప్పనిసరి చేశారన్న విషయాన్ని ఆయన చెప్పారు.

కాన్పూర్‌లోని సీఎస్‌ఏ యూనివర్శిటీలో రాష్టప్రతి కోవింద్, యూపీ గవర్నర్ రామ్‌నాయక్