జాతీయ వార్తలు

150 కిలోమీటర్లు నడవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: ప్రజలకు చేరువ కావాలని భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర శాఖ తన ఎమ్మెల్యేలకు సూచించింది. ఇందుకోసం ‘సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే కనీసం 150 కిలో మీటర్లకు తగ్గకుండా పాదయాత్ర చేయాలని నిర్దేశించింది.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఇలా పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలతో సంభాషించడానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి వీలు కలుగుతుందని బీజేపీ నాయకుడు ఒకరు మంగళవారం ఒక వార్తాసంస్థకు చెప్పారు. ‘మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరం అయినందున ఆయన జ్ఞాపకార్థం ఎమ్మెల్యేలు 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని నిర్దేశించడం జరిగింది’ అని ఆ నాయకుడు తెలిపారు. ‘మహారాష్టల్రోని మొత్తం 121 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు సమగ్ర వివరాలతో కూడిన చార్ట్‌ను అందజేశాం. ప్రచారం ఎలా చేయాలి? దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? తదితర అన్ని వివరాలను ఈ చార్ట్‌లలో పొందుపరిచినట్టు ఆయన వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్టల్రో బీజేపీ 122 నియోజకవర్గాలలో గెలుపొందింది. అయితే, ఇటీవల ఒక ఎమ్మెల్యే ఆ పార్టీలో నుంచి బయటకు వెళ్లారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 121కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు 150 కిలో మీటర్లు నడవడం పెద్ద సమస్య ఏమీ కాదని, ఎందుకంటే ఆ నియోజకవర్గాలు పెద్దగా ఉంటాయని, అయితే పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలు చిన్నగా ఉన్నందున ఇక్కడి ఎమ్మెల్యేలకే కాస్త సమస్య అని, అయితే, అర్బన్ ఎమ్మెల్యేలు తమ ఓటర్లందరినీ కలిస్తే 150 కిలో మీటర్ల నడక పూర్తవుతుందని ఆ నాయకుడు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గాంధీజీ వర్థంతి అయిన జనవరి 30వ తేదీ నాటికి 150 కిలోమీటర్ల నడక పూర్తి చేయాలని గడువు విధించినట్లు ఆయన తెలిపారు.