జాతీయ వార్తలు

రెహానా వెలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, అక్టోబర్ 21: శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను వెలివేస్తున్నట్లు ముస్లిం పెద్దలు ప్రకటించారు. లక్షలాది హిందువుల మనోభావాలను కించపరిచేలా ఆమె ప్రవర్తించారు.. అందుకు ఆమెను వెలివేస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ తెలిపింది. ఆమెపై తక్షణ చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ అధ్యక్షుడు ఏ పూన్‌కుంజు ఒక ప్రకటనలో వెల్లడించారు. మహల్లు నుంచి రెహానాతోపాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా వెలివేయాలని ఎర్నాకులం సెంట్రల్ ముస్లిం జమాత్‌కు సూచించినట్లు ఆయన తెలిపారు. గతంలో రెహానా ‘కిస్ ఆఫ్ లవ్’ ఉద్యమంలో పాల్గొనడంతోపాటు ఒక నగ్నచిత్రంలోకూడా నటించిందని, అందువల్ల ఆమెకు ముస్లిం పదాన్ని వాడే హక్కు లేదని అన్నారు. రెహానా శబరిమలకు వెళుతున్న సమయంలోనే కొందరు ఆమె ఇంటిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అత్యంత పోలీసు భద్రతతో ఆమె శబరిమల ఆలయాన్ని చేరుకున్నప్పటికీ అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో ఆమె ఆలయాన్ని సందర్శించలేక చివరికి వెనుతిరగాల్సి వచ్చింది. రెహానాతోపాటు హైదరాబాద్‌కు చెందిన ఒక జర్నలిస్టు కవిత కూడా అయ్యప్ప ఆలయానికి చేరుకుని ఆ తర్వాత వెనుతిరిగారు.