జాతీయ వార్తలు

దీపకాంతులతో అయోధ్య కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, నవంబర్ 6: అయోధ్య లక్షలాది దీపాల కాంతులతో మంగళవారం మిరుమిట్లు గొలిపింది. దీపావళి సందర్భంగా దాదాపు మూడు లక్షల దీపాలను సరయు తీరంలో ఏకకాలంలో వెలిగించారు. ఈ స్థాయిలో ఒకేసారి దీపాలను వెలిగించడం ద్వారా గిన్నిస్ రికార్డును సాధించారు. ఈ విషయాన్ని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అధికారిక నిర్ధారణకర్త రుషినాథ్ వెల్లడించారు. కేవలం ఐదు నిముషాల వ్యవధిలో మూడు లక్షల ఒక వెయ్యి 142 దీపాలను ఏకాకాలంలో వెలిగించారని ఇది ఒక కొత్త రికార్డని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌సూక్ సమక్షంలో ఆయన వెల్లడించారు. సరయు నది రెండు ఘాట్ల వద్ద మూడు లక్షల 35వేల దీపాలను వెలిగించాలని భావించారని, గతంలో హర్యానాలో 2016లో లక్షా 50 వేల తొమ్మిది దీపాలను వెలిగించి రికార్డు సృష్టిచారని, ఆ రికార్డు తాజా దీపోత్సవం అధిగమించిందని రిషినాథ్ తెలిపారు. ఏవిధంగా చూసినా కూడా ఇదో అద్భుతమైన దృశ్యమని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఫైజాబాద్ జిల్లాను
అయోధ్య జిల్లాగా ప్రకటించారు. ఇక నుంచి ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లా అవుతుందని మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ‘అయోధ్య ఆన్,బాన్,ఔర్ షాన్(గౌరవం, ఆత్మగౌరవం, ప్రతిష్ట)కు చిహ్నాం’అని సీఎం యోగి స్పష్టం చేశారు. ప్రముఖ తీర్థయాత్ర స్థలమైన అయోధ్య రాజధాని లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.‘అయోధ్యకు ఎవరూ అన్యాయం చేయలేరు’అని ఆయన అన్నారు. రాముడు ఇక్కడ జన్నించాడు కాబట్టే ఈ నగరం అంత పవిత్రంగా అలరారుతోంది’అని ఇక్కడ జరిగిన దీపోత్సవ్‌లో ఆయన తెలిపారు. శ్రీరాముడు తండ్రి దశరథ్ మహారాజు పేరుతు ఓ మెడికల్ కాలేజీ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
దక్షిణ కొరియా ప్రథమ మహిళ పర్యటన
దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జోంగ్-సూక్ మంగళవారం అయోధ్యలో పర్యటించారు. నగరంలో జరిగిన దీపావళి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. అలాగే నగరంలోని క్వీన్ హియో స్మారక మందిరాన్ని జోంగ్-సూక్ సందర్శించారు. హియోకు ఆమె నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆమె పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్వీన్ హియో స్మారకార్ధం చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియ ప్రధమ మహిళకు రామ్‌దర్బార్‌లో ఘన స్వాగతం లభించింది. తరువాత సరయి నది తీరానికి వెళ్లారు. అలాగే రామ్ కథ పార్క్‌ను సందర్శించారు. సీతాదేవి విగ్రహానికి కిమ్ పూలమాలలు వేశారు. యూపీ గవర్నర్ రామ్‌నాయక్, సీఎం ఆదిత్యనాథ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చిత్రాలు.. దీపకాంతులతో కళకళలాడుతున్న అయోధ్యలోని సరయూ నది ప్రాంతం.
*దీపాన్ని వెలిగిస్తున్న దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్-సూక్, యూపీ సీఎం ఆదిత్యనాథ్