జాతీయ వార్తలు

బీజీపీతోనే మాకు పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 6: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)అధినేత్రి మాయవతికి దేశ ప్రధాన మంత్రి కాగల అన్ని అర్హతలూ ఉన్నాయని చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి స్పష్టం చేశారు. జాతీయ కాంగ్రెస్‌ను వీడిన జోగి ‘చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్’ పేరుతో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా బీఎస్పీతో కలిసి ఆయన ఎన్నికలకు వెళ్తున్నారు. బీఎస్పీ-చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పొత్తులు ఖరారైన కొద్ది గంటల తరువాత ఓ జాతీయ మీడియా సంస్థకు అజిత్ జోగి ఇంటర్‌వ్యూ ఇచ్చారు. భవిష్యత్‌లోనూ మాయవతితోకలిసే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామన్న 72 అజిత్ జోగి ‘దేశ ప్రధానిగా మాయావతికి అన్ని అర్హతలూ ఉన్నాయి’అని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాయవతినే ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు.‘బీఎస్పీ అధినేత్రి తటస్థురాలు. వివాదాలకు అతీతంగా ఉంటారు. అలాగే మహిళ. దళిత వర్గం నుంచి వచ్చినామె. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అపార అనుభవం మాయవతికి ఉంది’అని ఆయన పేర్కొన్నారు. ఏ కోణంలో చూసినా మాయవతికే ప్రధాని కాగల అర్హతలున్నాయని మాజీ ఐఏఎస్ జోగి స్పష్టం చేశారు. బీఎస్పీ, చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్‌కు అజిత్ జోగియే ముఖ్యమంత్రి అభ్యర్థి. జోగికి రాష్ట్ర రాజకీయాలు కొట్టిన పిండి. చత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 2000-2003లో కాంగ్రెస్ తరఫున జోగి సీఎంగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాలేదు. బీజేపీ నేత రమణ్‌సింగ్ హవా కొనసాగింది. ఆయన ఏకంగా 15 ఏళ్లపాటు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాలుగోసారి ఆయన ఎన్నికలకు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు రాష్ట్రంలో బలమైన నాయకులు దూరమయ్యారు. 2016లో అజిత్ జోగి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీనే జరుగుతుంది. తాజాగా అజిత్ జోగి నాయకత్వంలోని చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్(జేసీసీ), బీఎస్పీ కూటమి తెరమీదకు రావడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. 90 స్థానాలున్న చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 12, 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది. జోగి నేతృత్వంలోని కూటమిని తక్కువగా అంచనావేయలేం. గిరిజనుల్లో ఆయనకు గట్టిపట్టు ఉంది. అందువల్ల అటు బీజీపీ ఇటు కాంగ్రెస్‌పైనా కొత్త కూటమి ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత అసెంబ్లీలో బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. 2013 ఎన్నికల్లో బీఎస్పీకి 4.27 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు మాయవతి, జోగి కూటమి వల్ల సామాజిక సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇద్దరూ దళిత,బలహీన వర్గాలకు చెందిన వారైనందున బీజేపీ-కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావమే చూపనుంది. 90 అసెంబ్లీ స్థానాల్లో 29 స్థానాలు ఎస్టీలకు, 10 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. రిజర్వుడ్ కాని స్థానాల్లోనూ ఎస్సీలకు 10 శాతం పైగానే ఓటు బ్యాంకు ఉంది. ఇలా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీలకు పది శాతం పైనే ఓట్లు ఉండడం గమనార్హం. రాష్ట్ర జనాభాలో బీసీల ఓటింగ్ 48 శాతం. ఈ ఎన్నికల్లో మాయవతి దళిత ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహరచన చేశారు. అజిత్ జోగి గిరిజన వర్గాలైన మహర్స్, సత్నామ్‌లలో మంచి పట్టున్న నాయకుడు. ఈ కూటమే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగుతుందన్న సంకేతాలు జోగి తన ఇంటర్‌వ్యూలో ఇచ్చారు. తమ కూటమిలోకి మరికొందరు వస్తారన్న ధీమా మాజీ సీఎం వ్యక్తం చేశారు.‘మాయవతితో అన్ని విషయాలూ మాట్లాడాను. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి’అని జోగి స్పష్టం చేశారు. రెండు దశల పోలింగ్‌పై ఆయన మాట్లాడుతూ ‘ మా కూటమికి బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పనైపోయింది’అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నాయకులు, కార్యకర్తలు లేరని, అదో బలహీనమైన స్థితిలో ఉందని జేసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.
ఇలా ఉండగా జోగి కోడలు రిచా జోగి బీఎస్పీ టికెట్‌పై అకల్‌టార నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జోగి కుటుంబ సభ్యులు నలుగురు మూడు పార్టీల్లో ఉన్నారు. జోగీ ఆయన కుమారుడు జేసీసీలో ఉన్నారు. జోగి భార్య రేణు జోగి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో జేసీసీ వైపుచూస్తున్నారు. చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో హంగ్ వస్తే అజిత్ జోగి కింగ్‌మేకర్ అవుతారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో చత్తీస్‌గఢ్‌లోనూ పక్క రాష్ట్ర మధ్యప్రదేశ్‌లోనూ జేసీసీ-బీఎస్పీ కూటమి క్రీయశీల పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.