జాతీయ వార్తలు

జేడీఎస్- కాంగ్రెస్ కూటమి గెలపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 6: కర్నాటకలో జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల విజయపరంపర కొనసాగుతోంది. మూ డు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి రెండు సీట్లలో, బీజేపీ ఒక సీటులో గెలిచింది.
రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ కూటమి నెగ్గింది. ప్రధానప్రతిపక్షమైన బీజేపీ ఈ ఎన్నికల ఫలితాలు చేదు ఫలితాలను మిగిల్చాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అన్ని సీట్లను గెలుస్తామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించగా, బీజేపీ ఈ ఎన్నికల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉందని బీజేపీ ప్రతిపక్ష నేత బీఎస్ యూడ్యూరప్ప అన్నారు. ఈ ఎన్నికల్లో బళ్లారి సిటింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. కాంగ్రెస్‌కు చెందిన వీఎస్ ఉగ్రప్ప దాదాపు 2.43 లక్షల ఓట్లతో నెగ్గింది. 15 ఏళ్లుగా బళ్లారి బీజేపీకి కంచుకోటగా ఉంది. రెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం ఎక్కువ. ఈ సీటులో బీజేపీ సీనియర్ నేత శ్రీరాములు సోదరి జే శాంత బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. శ్రీరాములు గాలి బ్రదర్స్‌కు అత్యంత ఆప్తుడు. షీమోగా లోక్‌సభస్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. బీజేపీ ప్రతిపక్షనేత యెడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52,148 ఓట్లతో గెలిచారు. ఈ సీటులో గెలవడం బీజేపీకి ఉపశమనం ఇచ్చింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధుపై రాఘవేంద్ర గెలిచారు. మాండ్యా లోక్‌సభ ఉప ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి ఎల్‌ఆర్ శివరామే గౌడ పెద్ద మెజార్టీతో నెగ్గారు. ఆయన 3,24,943 ఓట్లతో బీజేపీకి చెందిన మాజీ సివిల్ సర్వీసు అధికారి సిద్ధరామయ్యను ఓడించారు. మాండ్యాలో వొక్కళిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. రామనగర అసెంబ్లీ సీటులో ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భార్య అనిత 1,09,137 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. కుమారస్వామి చెన్నపట్న, రామనగర రెండు అసెంబ్లీ సీట్ల నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి, రామనగర సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. జమ్‌ఖండి అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణి, కాంగ్రెస్ అభ్యర్థ్ధి ఆనంద న్యాంగౌడ చేతిలో 39,480 ఓట్లతో ఓటమిచెందారు. తాజా ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తే 224 అసెంబ్లీ సీట్లలో జేడీఎస్-కాంగ్రెస్ బలం 120కు చేరుకుంది. బీజేపీకి 104 సీట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ వర్గాలు సంబరాలు జరుపుకున్నాయి. కర్నాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు మాట్లాడుతూ ప్రజల మూడ్‌కు ఈ ఎన్నికల నిదర్శనమని, బీజేపీ అంటే ప్రజలకు ఏవగింపు ఉందని, మోదీ మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగం ఆగ్రహించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. కర్నాటకలో బీజేపీ ఓడితే దక్షిణ భారతం నుంచి తరిమిగొట్టినట్లవుతుందన్నారు.
ప్రజా సంక్షేమానికి ఓటు
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు దక్కకుండా ఓడిస్తామని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ ప్రజా సంక్షేమా విధానాలకు ప్రజలు ఓటు వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఉమ్మడిగా పోటీచేస్తాయన్నారు. బీజేపీ విధానాలను ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రతిపక్ష పార్టీగా బీజేపీ విఫలమైందన్నారు. అనైతిక విధానాల ద్వారా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ ప్రతి క్షణం కుయుక్తులు పన్నుతోందన్నారు. నిజంగా ఈ ఎన్నికల ఫలితాలు దీపావళి సంబరాలకు కానుక అని ఆయన అన్నారు.

చిత్రం..కర్నాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించిన
నేపథ్యంలో విజయదరహాసంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్,
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గుండూ రావు తదితరులు