జాతీయ వార్తలు

విద్యతోనే మరో స్వర్ణశకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: భారత దేశంలో ఉన్న శాస్త్ర పరిశోధన అభివృద్ధి సంస్థలన్నీ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేరుకోగలవన్న ధీమాను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత సంతృప్తికరంగా లేదని, దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని వెల్లడించారు. భారతదేశం మరో స్వర్ణయుగంలోకి అడుగుపెట్టాలంటే అది విద్య ద్వారానే సాధ్యమని, ఇది ఏ వస్తువునైనా బంగారంలా మార్చే ద్రావకం లాంటిదని, తాను రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజున స్పష్టం చేసిన విషయాన్ని ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
భారత విశ్వవిద్యాలయాల స్థితిగతులకు సంబంధించి తనకో నివేదికను అందించిన సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు. ఓపి జిందాల్ గ్లోబర్ యూనివర్సిటీ, విద్యా ర్యాంకింగ్‌లు సామర్థ్యం (ఐకేర్) సంస్థలు ఈ నివేదికను అందించాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఓ పక్క రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూనే దేశంలో ఉన్నత విద్యా నాణ్యలతలను పెంపొందించాల్సిన అవసరం గురించి తాను ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నానని ప్రణబ్ అన్నారు. గత ఏడు దశాబ్దాల కాలంలో ఉన్నత విద్యకు సంబంధించిన భౌతిక స్వరూపం బలోపేతం అయినప్పటికీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలకు ప్రాధాన్యత లభించడం లేదని ప్రణబ్ తెలిపారు.