జాతీయ వార్తలు

శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని తాము వ్యతిరేకించడం లేదని కేరళ్‌లోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ స్పష్టం చేసింది. కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మహిళల ఆలయ ప్రవేశాన్ని సమర్ధిస్తూ 2007లో ఇచ్చిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ‘ఆనాడు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అందజేసిన అఫిడవిట్‌కు మేం కట్టుబడి ఉన్నాం. శబరిమల కేసులో దానినే దాఖలు చేయాల్సిందిగా కోరాం’ అని మంత్రి చెప్పారు. శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశానికి సంబంధించి తమ ప్రభుత్వం వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. మహిళల స్వేచ్ఛ, సమానత్వానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సురేంద్రన్ చెప్పారు.