జాతీయ వార్తలు

రాఫెల్‌పై నోరు విప్పరేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదల్‌పూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 10: అర్బన్ నక్సలైట్లతో తమకు సంబంధం ఉందని బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, దేశ భక్తి గురించి తమ పార్టీ పాఠాలు నేర్చుకోవాల్సిన పనిలేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ త్యాగమూర్తుల నిలయమన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లలో బీజేపీ అవినీతికి పాల్పడిందని, దీనిపై నోరుమెదపకుండా ప్రధాని మోదీ తిరుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ప్రయోజనం చేసేందుకు మోదీ అన్ని నిబంధనలను ఉల్లంఘించారన్నారు. దేశానికి రక్షకుడుగా ఉంటానని హామీ ఇచ్చిన మోదీ స్కాంలలో కూరుకుపోయారన్నారు. చత్తీస్‌గడ్‌లో మొదటి దశ ఎన్నికలు ఈ నెల 12వ తేదీ సోమవారం జరుగుతాయి. మొదటి దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం శనివారం ముగిసింది. ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తన స్నేహితుడైన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కోసం ఒప్పంద నిబంధలను మార్చి వేసి రాఫెల్ ఫైటర్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్నారు. తనతో పాటు అంబానీని ఫ్రాన్స్‌కు తీసుకెళ్లారన్నారు. ఒక జెట్ ఖరీదు రూ.1600 కోట్లకు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం ఖరారు చేశారన్నారు. వాస్తవానికి ఒక్కో ఫైటర్ ధర రూ. 526 కోట్లకు యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. హెచ్‌ఏఎల్‌కు మోసం చేశారన్నారు. రక్షణ రంగంలో, ఏరో స్పేస్‌లో మంచి నిపుణులు ఈ సంస్థలో ఉన్నారన్నారు. అనిల్ అంబానీ రూ.45వేల కోట్లవరకు బ్యాంకులకు బకాయి పడ్డారన్నారు. ఈ డీల్‌లో అంబానీకి రూ.30వేల కోట్ల వరకు లాభం కలుగుతుందన్నారు. అనిల్ అంబానీకి ఉన్న అర్హత ఏమిటని ఆయన ప్రశ్నించారు. మోదీ స్నేహితుడు కావడమే అనిల్ అంబానీ అర్హతనా ఆయన నిలదీశారు. ఈ ఫైటర్ జెట్స్ కొనుగోళ్ల వ్యవహారం ముమ్మాటికీ అవినీతికి పరాకాష్ట అని చెబుతున్నామన్నారు. పనామా పేపర్ల లీక్‌లో పాక్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ పేరుందని తెలిసిన వెంటనే పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారన్నారు. పనామా పత్రాల్లో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కుమారుడి పేరున్నా, పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామన్నారు. పంట ఉత్పత్తులు చేసిన రైతులకు బోనస్ ఇస్తామని, పుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామని అన్ని జిల్లాల్లో రైతుల పిల్లలకు ఈ ప్లాంట్లలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
చిత్రం..చత్తీస్‌గఢ్ లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ