జాతీయ వార్తలు

ఈ వేధింపులకు నేనూ బలయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 10: భారతదేశంలో అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఏదోవిధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని, తాను కూడా బాలీవుడ్‌లో లైంగిక హింసకు బలయ్యానని మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్ తెలిపారు. మీటూ శీర్షిక కింద ఆమె తాను చవిచూసిన చేదు అనుభవాలను ట్వీట్ చేశారు. నిహారికా సింగ్ మిస్ లలీ సినిమాలో నటించారు. ఆమె చిత్రపరిశ్రమలో ఎదుర్కొన్న అనేక సంఘటనలను వివరించారు. తాను మొదట రాజ్ కన్వర్ సినిమాల్లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానని, కాని సినిమా విడుదల కాలేదన్నారు. అనంతరం భూషణ్ కుమార్ సినిమాలో నటించేందుకు అంగీకరించానన్నారు. ఒక రోజు తన ఆఫీసుకు పిలిస్తే వెళ్లానన్నారు. అక్కడ భూషణ్ కుమార్ కవర్‌లో రెండు ఐదు వందల రూపాయల కరెన్సీ కాగితాలు పెట్టి ఇచ్చారన్నారు. మీ గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. కాస్సేపు గడుపుదాం అని సందేశం ఇచ్చినట్లు చెప్పారు. తాను వెంటనే స్పందించి ఇద్దరం కలిసి వెళదాం. కాని మీరు మీ భార్యతో రండి. నేను బాయ్ ఫ్రెండ్‌తో వస్తాను అని సందేశం ఇచ్చానన్నారు. దీని వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. పైగా తనకు పారితోషికం అందలేదని నిహారికా సింగ్ చెప్పారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ అనే నటుడితో కలిసి నటించేందుకు 2009లో మిస్ లలీ సినిమా విషయంలో కాంట్రాక్టు ఖరారైందన్నారు. ఒక రోజు నవాజుద్దీన్‌ను ఇంటికి ఆహ్వానించానన్నారు. కాని వచ్చిన వెంటనే తనను గట్టిగా కౌగిలించుకున్నారన్నారు. ఆ కౌగిలి నుంచి బయటపడడం కష్టమైందన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, తనకు మిస్ ఇండియాను కౌగిలించుకోవాలనే ఆకాంక్ష ఉందని, అందుకే ఆవేశపడ్డానని చెప్పారని నిహారికా సింగ్ చెప్పారు. నవాజుద్దీన్ అబద్దాలు చెబుతుంటారని గ్రహించి దూరమైనట్లు చెప్పారు. మూడేళ్ల తర్వాత ఒక ఫంక్షన్‌లో కలుసుకుంటే తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, లైంగిక సంబంధాలు కావాలని నవాజుద్దీన్ చెబితే తిరస్కరించినట్లు ఆమె చెప్పారు.

చిత్రం..నిహారికా సింగ్, నవాజుద్దీన్